Telangana: టీఎస్పీఎస్సీ Group 1, group 2 పోస్టులకు ఇంటర్వ్యూలు ఎత్తివేయనున్న తెలంగాణ సర్కార్‌! 2 రోజుల్లో విడుదలకానున్న జీవో..

తెలంగాణ రాష్ట్రంలో టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే గ్రూప్స్ పరీక్ష విధానంలో పెను మార్పులు సంభవించనున్నాయి. గ్రూప్‌ 1, గ్రూప్‌ II ఉద్యోగాలకు రాత పరీక్షల అనంతరం నిర్వహించే..

Telangana: టీఎస్పీఎస్సీ Group 1, group 2 పోస్టులకు ఇంటర్వ్యూలు ఎత్తివేయనున్న తెలంగాణ సర్కార్‌! 2 రోజుల్లో విడుదలకానున్న జీవో..
Interview For Groups

Updated on: Apr 12, 2022 | 3:50 PM

TSPSC likely to cancel interviews for Group exams: తెలంగాణ రాష్ట్రంలో టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే గ్రూప్స్ పరీక్ష విధానంలో పెను మార్పులు సంభవించనున్నాయి. గ్రూప్‌ 1, గ్రూప్‌ II ఉద్యోగాలకు రాత పరీక్షల అనంతరం, పోస్టుల భర్తీలో కీలకమైన పాత్ర వహించే ఇంటర్వ్యూలను (interviews for TSPSC Groups) తీసివేయాలని తెలంగాణ సర్కార్‌ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు న్యాయ నిపుణులు, టీఎస్‌పీఎస్సీ అధికారులతో చర్చించి నేడో, రేపో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనుంది. అయితే, ఈ నిర్ణయం తీసుకునే విషయంలో ప్రభుత్వ వర్గాలు ఆచితూచి వ్యవహరించాయి. న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు ఫైలును న్యాయ శాఖకు పంపడంతో పాటు కేబినెట్‌ ఆమోదం అవసరమా.. కాదా.. అనే విషయంలోనూ లోతుగా పరిశీలించాయి.

పోటీ పరీక్షల నిర్వహణ విధానంలో మార్పుచేర్పులకు కేబినెట్‌ ఆమోదం అవసరం లేదని నిర్ధారించుకోవడం, టీఎస్‌పీఎస్సీ అధికారులతో కూడా జరిపిన సంప్రదింపుల అనంతరం దీనికి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో ఈ మేరకు జీవో విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇక, ఇప్పటికే 30,453 వేల పైగా ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వగా, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) అనంతరం 20 వేల టీచర్‌ పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో టెట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు పరీక్షకు హాజరయ్యేలా డీఎస్సీ ప్రకటనకు మార్గం సుగమం కానుంది. ఉపాధ్యాయ పోస్టులు, ఇప్పటికే పరిపాలన అనుమతులు వచ్చిన పోస్టులు పోను మిగిలిన మరో 30 వేల పోస్టుల భర్తీకి కూడా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అనుమతి ఇచ్చిన పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడగానే మిగిలిన పోస్టుల భర్తీకి పరిపాలన అనుమతులు ఇచ్చే యోచనలో ముందుకెళుతోంది.

Also Read:

TSPSC Group I Recruitment 2022: త్వరలో 503 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ జారీ! ఐతే అంతకంటేముందే..