
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈ/ బీటెక్/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలకు ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ ఈసెట్) 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి (టీఎస్‌సీహెచ్‌ఈ) ప్రకటన వెలువరించింది. పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ(మ్యాథమేటిక్స్) అభ్యర్థులు నేరుగా ఇంజనీరింగ్ రెండో ఏడాదిలో ప్రవేశాలు పొందవచ్చు. ఈ ఏడాది ఈసెట్ పరీక్షను హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 9 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
తెలంగాణ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ ఈసెట్)-2026కు దరఖాస్తు చేసుకోవాలంటే.. అభ్యర్ధులు తప్పనిసరిగా పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథమేటిక్స్)లో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. అభ్యర్ధుల రిజిస్ట్రేషన్ ఫీజు జనరల్ అభ్యర్ధులకు రూ.900, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.500 చొప్పున ఉంటుంది. మే 15న రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
తెలంగాణ ఈసెట్-2026 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.