EAPCET 2025 Exam Date: విద్యార్ధులకు అలర్ట్.. ఈఏపీసెట్‌ పరీక్షల హాల్‌ టికెట్లు వచ్చేశాయ్..! డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

TG EAPCET 2025 Hall Tickets: 2025-26 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌-ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించనున్న ఈఏపీసెట్‌ 2025కు ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ తాజాగా ముగిసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2.19 లక్షల మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఉన్నత విద్యామండలి హాల్ టికెట్లను కూడా విడుదల చేసింది..

EAPCET 2025 Exam Date: విద్యార్ధులకు అలర్ట్.. ఈఏపీసెట్‌ పరీక్షల హాల్‌ టికెట్లు వచ్చేశాయ్..! డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే
TG EAPCET 2025 Exam

Updated on: Apr 20, 2025 | 7:33 AM

హైదరాబాద్‌, ఏప్రిల్ 20: తెలంగాణ ఈఏపీసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. ఇంజినీరింగ్‌కు గత ఏడాది 2.54 లక్షల దరఖాస్తులు అందగా.. ఈసారి 2.19 లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇక అగ్రికల్చర్‌ విభాగానికి గత ఏడాది సుమారు లక్ష మంది దరఖాస్తు చేసుకుంటే.. ఈసారి కేవలం 86 వేలు మాత్రమే వచ్చాయి. మొత్తంగా ఈ ఏడాది ఈఏపీసెస్‌ 2025 దరఖాస్తులు భారీగా తగ్గాయనే చెప్పవచ్చు. ఇదిలా ఉంటే.. అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లను ఉన్నత విద్యామండలి తాజాగా విడుదల చేసింది. ఈ మేరకు హాల్‌ టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు తెలంగాణ ఈఏపీ సెట్‌ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఇందులో ఏప్రిల్‌ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మా ప్రవేశ పరీక్షలు జరుగుతాయి. ఇక మే 2 నుంచి 4 వరకు ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షలు జరగనున్నాయి.

ఈ పరీక్షలు రోజుకు రెండు సెషన్లలో జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 వరకు రెండో సెషన్‌ పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రాంతాల్లోని 124 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షకు 2,19,420 మంది.. అగ్రికల్చర్‌, ఫార్మా ప్రవేశ పరీక్షకు 86,101 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ పరీక్షలకు ఒక్క నిమిషం నిబంధన అమలులో ఉంటుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఈఏపీసెట్‌ అభ్యర్థుల కోసం ఇప్పటికే మాక్‌ టెస్ట్‌లు ఉన్నత విద్యామండలి అందుబాటులో ఉంచింది. ఎలాంటి పాస్‌వర్డ్‌ లేకుండానే ఆన్‌లైన్‌ విధానంలో మాక్‌ టెస్టులు రాసుకోవచ్చు.

తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 హాల్‌ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ఏప్రిల్ 22న తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల..

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల ఏప్రిల్ 22న చేయనున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి ఎస్‌ కృష్ణ ఆదిత్య తెలిపారు. రిజల్ట్స్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదగా ప్రకటించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు విద్యాభ వన్‌లో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. విద్యార్థులు/తల్లి దండ్రులు ఫలితాల కోసం బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ tgbie.cgg.gov.in ద్వారా ఫలితాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఐవీఆర్‌ పోర్టల్‌ 9240205555 ఫోన్‌నంబర్‌ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. కాగా ఇంటర్ పరీక్షలు మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు జరిగిన సంగతి తెలిసిందే.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.