TGPSC Group 2 Jobs: గ్రూప్‌ 2 ఉద్యోగాలకు పోస్టింగ్ దశలో బ్రేక్.. ఎదురు చూపులు ఇంకెన్నాళ్లో??

Telangana Group 2 recruitment 2025 process delayed: గ్రూప్‌ 2 ఉద్యోగాల నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని నిరుద్యోగ అభ్యర్థులు టీజీపీఎస్సీకి శనివారం (సెప్టెంబర్‌ 13) విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 2022లో గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్‌ వెలువడిన ఇప్పటి వరకు నియామక ప్రక్రియ పూర్తికాలేదు. ఇప్పటికే ధ్రువీకరణ పత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు కూడా..

TGPSC Group 2 Jobs: గ్రూప్‌ 2 ఉద్యోగాలకు పోస్టింగ్ దశలో బ్రేక్.. ఎదురు చూపులు ఇంకెన్నాళ్లో??
Telangana Group 2 Recruitment Process Delayed

Updated on: Sep 14, 2025 | 3:58 PM

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 14: తెలంగాణలో గ్రూప్‌ 2 ఉద్యోగాల నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని నిరుద్యోగ అభ్యర్థులు టీజీపీఎస్సీకి శనివారం (సెప్టెంబర్‌ 13) విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 2022లో గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్‌ వెలువడిన ఇప్పటి వరకు నియామక ప్రక్రియ పూర్తికాలేదు. ఇప్పటికే ధ్రువీకరణ పత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు కూడా పూర్తయ్యాయి. మూడేళ్లు గడుస్తున్నా పోస్టింగ్‌ ప్రక్రియ ఓ కొలిక్కిరాలేదని పేర్కొన్నారు. గ్రూప్‌ 1 పరీక్ష న్యాయవివాదాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో దాని ఫలితాలు వెలువడే వరకు వేచిచూడకుండా గ్రూప్‌ 2 నియామకాలు పూర్తిచేయాలని టీజీపీఎస్సీకి వినతిపత్రం సమర్పించారు.

నిజానికి ఉద్యోగాల నియామక పత్రాల అందజేత దశలో గ్రూప్‌ 1తో సహా వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు ఆగిపోయి ఉన్నాయి. తాజాగా గ్రూప్‌ 1 మెయిన్స్‌ ఫలితాలను హైకోర్టు సింగిల్‌ జడ్జి ధర్మాసనం రద్దు చేసింది. దీంతో డివిజన్‌ బెంచ్‌కు వెళ్లేందుకు కమిషన్‌ సన్నాహాలు చేస్తుంది. గ్రూప్‌-1 పరీక్ష ఫలితాలపై వచ్చిన తీర్పుతో గ్రూప్‌-2, గ్రూప్‌-3 పోస్టుల నియామకాలపైనా ప్రభావం పడనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే తొలుత గ్రూప్‌-1 పోస్టింగ్‌లు భర్తీ చేశాకే గ్రూప్‌ 2, గ్రూప్‌ 3 పోస్టులు భర్తీ చేయాలని టీజీపీఎస్సీ గతంలోనే నిర్ణయించింది. ఆ లెక్కన చూస్తే గ్రూప్‌ 2 పోస్టింగ్‌లు ఇప్పట్లో ఉండే అవకాశం లేదు. అందుకే అభ్యర్ధులు గ్రూప్ 1 పోస్టులకు లింకు పెట్టకుండా తమకు త్వరిత గతిన న్యాయం చేయాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. మరోవైపు జాబ్‌ క్యాలెండర్‌ కూడా ఆలస్యం కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us