TET Qualification: సుప్రీంకోర్టు టెట్‌ తీర్పుపై ప్రభుత్వ టీచర్ల గుండెల్లో గుబులు.. రివిజన్‌ పిటిషన్‌కు సమాయత్తం

సెప్టెంబర్ 1 సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక స్థాయిలలో 1 నుంచి 8వ తరగతుల వరకు పనిచేస్తున్న ఉపాధ్యాయులు తమ కొలువుల్లో కొనసాగాలంటే TETలో ఉత్తీర్ణులు కావాలని ప్రకటించింది. పదవీ విరమణకు ముందు ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ మిగిలి ఉన్న ఉపాధ్యాయులందరూ..

TET Qualification: సుప్రీంకోర్టు టెట్‌ తీర్పుపై ప్రభుత్వ టీచర్ల గుండెల్లో గుబులు.. రివిజన్‌ పిటిషన్‌కు సమాయత్తం
Supreme Court Mandates Tet Qualification For All Teachers

Updated on: Sep 18, 2025 | 5:49 PM

అమరావతి, సెప్టెంబర్‌ 18: దేశ వ్యాప్తంగా ఉన్న టీచర్లందరికీ ఐదేళ్లకు మించి సర్వీసు ఉంటే.. వారతా రెండోళ్లలోగా తప్పనిసరిగా టెట్‌ పాస్‌ కావాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. టెట్‌ అర్హత పొందకుంటే పదవీ విరమణ చేయాల్సి ఉంటుందని సెప్టెంబరు 1న సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే ఈ తీర్పును సవాల్‌ చేస్తూ రివ్యూ దాఖలు చేయాలని స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీఎఫ్‌ఐ) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సెప్టెంబరు 17న ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర విద్యాశాఖ, ఆ శాఖ కార్యదర్శులకు వినతిపత్రాలు సమర్పించింది. STFIతోపాటు TGTA, TTA–HB వంటి అనుబంధ రాష్ట్ర స్థాయి సంస్థలు మద్దతు తెలిపాయి.

కాగా సెప్టెంబర్ 1 సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక స్థాయిలలో 1 నుంచి 8వ తరగతుల వరకు పనిచేస్తున్న ఉపాధ్యాయులు తమ కొలువుల్లో కొనసాగాలంటే TETలో ఉత్తీర్ణులు కావాలని ప్రకటించింది. పదవీ విరమణకు ముందు ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ మిగిలి ఉన్న ఉపాధ్యాయులందరూ TETలో ఉత్తీర్ణత సాధించాలని స్పష్టం చేసింది. పదవీ విరమణకు ఐదేళ్ల కంటే తక్కువ సమయం ఉన్నవారు TETలో ఉత్తీర్ణులు కాకుండానే కొనసాగవచ్చు. కానీ పదోన్నతికి అర్హులు కారు. అర్హత సాధించడానికి రెండేళ్ల సమయం ఇచ్చింది. టెట్‌లో ఉత్తీర్ణత కాకుంటే కొలువు కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే భవిష్యత్తులో జరిగే అన్ని బోధనా నియామకాలకు TET ఉత్తీర్ణత తప్పనిసరని తెలిపింది.

దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హతలను ప్రామాణీకరించడం ద్వారా నాణ్యమైన విద్య అందించాలనేది ఈ ఉత్తర్వు లక్ష్యం. విద్యా హక్కు (RTE) చట్టం, 2009ని బలోపేతం చేయడం, జాతీయ ఉపాధ్యాయ విద్య మండలి (NCTE) నిబంధనలకు అనుగుణంగా ఉండటం లక్ష్యంగా ఈ నిబంధనను తీసుకువచ్చింది. అయితే ఈ తీర్పు ఉపాధ్యాయ సంఘాలలో తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. బోధనా ప్రమాణాలను మెరుగుపరచాలనే ఉద్దేశ్యాన్ని చాలామంది అంగీకరిస్తున్నప్పటికీ, దశాబ్దాల సేవ చేసిన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు తమ కెరీర్‌ తుది దశలో TET ద్వారా తిరిగి అర్హత నిరూపించుకోవాలని బలవంతం చేయకూడదని వాదిస్తున్నారు. మరోవైపు సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సమీక్ష పిటిషన్ దాఖలు చేయాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం ప్రాథమిక విద్యా శాఖను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.