TCS Infosys Wipro HCL: ఐటీ సర్వీసులకు పెరుగుతున్న డిమాండ్‌.. కంపెనీల్లో ఫ్రెషర్స్​ కోసం లక్షకుపైగా ఉద్యోగాలు..!

|

Jul 20, 2021 | 1:30 PM

TCS Infosys Wipro HCL: భారతదేశంలో ఉన్న టాప్‌ మూడు ఐటీ కంపెనీలు ఉద్యోగులను నియమించుకోవడంలో ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష..

TCS Infosys Wipro HCL: ఐటీ సర్వీసులకు పెరుగుతున్న డిమాండ్‌.. కంపెనీల్లో ఫ్రెషర్స్​ కోసం లక్షకుపైగా ఉద్యోగాలు..!
Follow us on

TCS Infosys Wipro HCL: భారతదేశంలో ఉన్న టాప్‌ మూడు ఐటీ కంపెనీలు ఉద్యోగులను నియమించుకోవడంలో ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష మందికి పైగా ఫ్రెషర్స్​ను నియమించుకోవాలని భావిస్తు్న్నాయి. ఐటీ సర్వీస్‌‌లకు డిమాండ్ పెరుగుతుండడంతో టీసీఎస్‌‌, ఇన్ఫోసిస్‌‌, విప్రో కంపెనీలు హైరింగ్ యాక్టివిటీని పెంచాయి. టీసీఎస్‌‌ ఈ ఏడాది జూన్ క్వార్టర్‌‌‌‌లో 20 వేల మందిని తీసుకుంది. ఇన్ఫోసిస్‌‌ 8,300 మందిని, విప్రో 12 వేల మందిని హైర్‌‌‌‌ చేసుకున్నాయి. గత ఏడాది జూన్‌ త్రైమాసికంలో 40 వేల మంది ఫ్రెషర్స్​కు టీసీఎస్ ఉద్యోగాలను అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా 40 వేలు లేదా అంతకంటే ఎక్కువ మంది ఫ్రెషర్స్​ను నియమించుకుంటామని టీసీఎస్‌ వెల్లడించింది.

ఇన్ఫోసిస్‌‌ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్లోబల్‌‌గా 35 వేల మందిని నియమించుకుంటామని ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌‌ క్వార్టర్‌‌‌‌లో 10 వేల మంది సీనియర్లను, 2 వేల మంది ఫ్రెషర్స్​ను నియమించుకున్నామని విప్రో ప్రకటించింది. సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌లో మరో 6 వేల మందిని హైర్ చేసుకోవడానికి కంపెనీ ప్లాన్స్‌‌ వేస్తోంది. 2022–23 నాటికి మొత్తం30 వేల మందికి ఆఫర్ లెటర్స్ అందించాలని చూస్తోంది.

ఇవీ కూడా చదవండి:

Goldman Sachs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. హైదరాబాద్‌లో రాబోయే రెండేళ్లలో ఈ కంపెనీలో 2 వేల ఉద్యోగాలు

Telangana Job Fair: నేడు తెలంగాణలో జాబ్‌ ఫెయిర్‌.. 3500 ఖాళీలు.. పది కంపెనీల ఇంటర్వ్యూలు