Defence Services Staff College: డిఫెన్స్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కాలేజ్‌లో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..

|

May 18, 2021 | 1:18 PM

Defence Services Staff College Recruitment: త‌మిళ‌నాడు వెల్లింగ్‌ట‌న్‌లో ఉన్న డిఫెన్స్ స‌ర్వీసెస్ స్టాప్ కాలేజీ (డీఎస్ఎస్‌సీ)లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. త‌మిళ‌నాడులోని...

Defence Services Staff College: డిఫెన్స్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కాలేజ్‌లో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..
Defence Services Staff College
Follow us on

Defence Services Staff College Recruitment: త‌మిళ‌నాడు వెల్లింగ్‌ట‌న్‌లో ఉన్న డిఫెన్స్ స‌ర్వీసెస్ స్టాప్ కాలేజీ (డీఎస్ఎస్‌సీ)లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. త‌మిళ‌నాడులోని వెల్లింగ్‌ట‌న్‌లో ఉన్న ఈ కాలేజీలో గ్రూప్‌-సి సివిలియ‌న్ పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. ప‌లు విభాగాల్లో మొత్తం 83 పోస్టుల‌ను రిక్రూట్ చేయ‌నున్నారు.

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌–2–04, లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌–10, సివిలియన్‌ మోటార్‌ డ్రైవర్‌–07, సుఖాని–01, కార్పెంటర్‌–01, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌(ఆఫీస్,ట్రెయినింగ్‌)–60 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌–2 ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు ఇంటర్మీడియట్‌/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. డిక్టేషన్, ట్రాన్స్‌క్రిప్షన్‌లో నైపుణ్యం ఉండాలి.

* లోయర్‌ డివిజన్‌ క్లర్క్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు.. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి. టైపింగ్‌ స్పీడ్‌ ఉండాలి.

* సివిలియన్‌ మోటార్‌ డ్రైవర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు.. ఇంటర్మీడియట్‌/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. హెవీ వెహికల్స్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌తోపాటు రెండేళ్ల అనుభవం ఉండాలి.

* సుఖాని పోస్టుకు అప్లై చేసుకునే వారు ఇంటర్మీడియట్‌/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. గుర్తింపు పొందిన సంస్థ నుంచి స్విమ్మింగ్‌లో సర్టిఫికేట్, మంచి సెయిలింగ్‌ నాలెడ్జ్‌తోపాటు రెండేళ్ల అనుభవం ఉండాలి.

* కార్పెంట‌ర్ ఉద్యోగాల‌కు ఇంటర్మీడియట్‌/తత్సమాన ఉత్తీర్ణ‌త‌ను అర్హ‌త‌గా నిర్ణ‌యించారు.

* మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఆఫీస్, ట్రెయినింగ్‌) పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు మెట్రిక్యులేషన్‌/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* అర్హ‌త, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఆఫ్‌లైన్ విధానం ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివ‌రాల‌ను ది కమాండెంట్, డిఫెన్స్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కాలేజ్, వెల్లింగ్‌టన్‌(నీలగిరీస్‌)–643231, తమిళనాడు చిరునామకు పంపించాలి.

* ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థుల‌ను రాతపరీక్ష/స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీగా 22.05.2021 నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: http://www.dssc.gov.inను సంద‌ర్శించండి.

Also Read: Covid suicides : కరోనా అనుమానంతో బలవన్మరణాలు.. హన్మకొండ, జనగాం జిల్లాల్లో హృదయ విదారక ఘటనలు

Marriage: పెళ్లి కోసం ఆ వరుడు అడిగిన వరకట్నం ఏమిటో తెలుసా? తెలిస్తే నువ్వు మామూలోడివి కాదు బ్రో అంటారు!

TSPSC Recruitment 2021: క‌రోనా నేప‌థ్యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్‌.. ద‌రఖాస్తులకు గ‌డువు..