Tamil Nadu CM Stalin-NEET Exam: దేశ వ్యాప్తంగా నీట్ పరీక్షలు పూర్తి అయ్యాయి. అయితే తమిళనాడులో నీట్ పరీక్షా విధానం మరోసారి ప్రకంపనలు సృష్టిస్తుంది. నీట్ పరీక్షపై తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నీట్ పరీక్ష నుండి తమిళనాడుని మినహాయించాలని కోరుతూ, శాసనసభలో బిల్ వేయనున్నారు. ఈ మేరకు అసెంబ్లీ లో తీర్మానం చేశారు. ఇంటర్ సెకన్డ్ ఇయర్ ఫలితాల ఆధారంగా మెడికల్ విద్యార్థులకు సీట్ కేటాయించాలని కోరుతున్నారు. ఈ మేరకు నీట్ కు వ్యతిరేకంగా సీఎం స్టాలిన్ అసెంబ్లీలో ఒక తీర్మానం ప్రవేశం పెట్టారు. దీనిని ప్రతిపక్ష అన్నాడీఎంకే పార్టీ మద్దతు తెలిపింది. నీట్ కి వ్యతిరేకం గా డీఎంకే పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుందని అసెంబ్లీ లో సీఎం స్టాలిన్ వెల్లదించారు.
అయితే ఈ బిల్ కి రాష్ట్రపతి సమ్మతం కావాలని తమిళనాడు ప్రభుత్వం కోరుకుంటుంది. 2017లో కూడా తమిళనాడు ప్రభుత్వం నీట్ వద్దని కోరుతూ బిల్ ప్రవేశ పెట్టింది. కానీ, దానికి రాష్ట్రపతి ఆమోదం లభించలేదు. మరి ఇప్పుడు ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభిస్తుందో లేదో చూడాలి మరి. అయితే తమిళనాడులో నీట్ పరీక్ష కారణంగా ఇదివరకే వైద్య విభాగంలో ఆసక్తి ఉన్న కొంతమంది విద్యార్థులు తమ ప్రాణాలను బలి తీసుకోగా తాజాగా సేలంలోని ఒక విద్యార్థి నీట్ పరీక్షులకు హాజరుకాకుండా ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడు లో ఈ సంఘటన రాజకీయ ప్రకంపలను సృష్టిస్తుంది. అందువల్ల తమిళనాడును నీట్ నుండి మినహాయించాలని కోరుతున్నారు.
ఆహారపదార్ధాలను .. వేరే పదార్ధాలతో కలిపి తినకూడదట… ఆ ఫుడ్ కాంబినేషన్స్ ఏమిటో చూద్దాం..
.