SVNIT Recruitment 2022: సర్దార్ వల్లభ్‌భాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో టెక్నీషియన్‌ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్‌లోనున్న సర్దార్ వల్లభ్‌భాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 38 సీనియర్‌ టెక్నీషియన్‌, టెక్నీషియన్‌ పోస్టులకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

SVNIT Recruitment 2022: సర్దార్ వల్లభ్‌భాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో టెక్నీషియన్‌ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
SVNIT Surat Recruitment 2022

Updated on: Nov 13, 2022 | 7:24 AM

గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్‌లోనున్న సర్దార్ వల్లభ్‌భాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 38 సీనియర్‌ టెక్నీషియన్‌, టెక్నీషియన్‌ పోస్టులకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిల్లో సీనియర్‌ టెక్నీషియన్‌ పోస్టులు 13, టెక్నీషియన్‌ పోస్టులు 25 వరకు ఉన్నాయి. కెమికల్ ఇంజినీరింగ్/ కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌, ఐటీఐ లేదా డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా 27 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 12, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.500లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌/దివ్యాంగ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఇతర వివరాలు ఆధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us