SSC Head Constable Jobs 2025: ఇంటర్ అర్హతతో.. పోలీస్ హెడ్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌! 

SSC Head Constable (Ministerial) in Delhi Police Examination 2025: హెడ్‌కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్సెస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 509 హెడ్‌కానిస్టేబుల్‌ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. పురుషులు, మహిళా అభ్యర్థులు ఎవరైనా ఈ పోస్టులకు

SSC Head Constable Jobs 2025: ఇంటర్ అర్హతతో.. పోలీస్ హెడ్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌! 
SSC Delhi Police Head Constable Jobs

Updated on: Oct 01, 2025 | 4:08 PM

కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ఢిల్లీ పోలీస్‌ విభాగంలో.. హెడ్‌కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్సెస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 509 హెడ్‌కానిస్టేబుల్‌ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. పురుషులు, మహిళా అభ్యర్థులు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం పోస్టుల్లో హెడ్‌ కానిస్టేబుల్‌ (మినిస్టీరియల్‌) పురుష అభ్యర్ధుల పోస్టులు 341, హెడ్‌ కానిస్టేబుల్(మినిస్టీరియల్‌) మహిళా అభ్యర్ధుల పోస్టులు 168 వరకు ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పురుష అభ్యర్ధుల ఎత్తు 165 సెంటీమీటర్లు, మహిళల ఎత్తు 157 సెంటీమీటర్లు ఉండాలి. చెస్ట్‌ 78 నుంచి 82 సెంటీమీటర్ల వరకు ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 2025 జులై 1వ తేదీ నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అర్హత కలిగిన వారు ఆన్‌లైన్‌ ద్వారా అక్టోబర్‌ 20, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌ సర్వీస్‌ మెన్‌ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్‌(పీఎస్‌టీ), ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌(పీఎస్‌టీ) ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింది నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు ఇవే..

  • ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: అక్టోబర్‌ 20, 2025.
  • దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ: అక్టోబర్‌ 21, 2025.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు సవరణ తేదీ: అక్టోబర్‌ 27 నుంచి 29 వరకు
  • రాత పరీక్ష తేదీ: 2025 డిసెంబర్‌ లేదా 2026 జనవరిలో

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.