Spices Board Kochi Executive Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి చెందిన స్పైసెస్ బోర్డ్ (Spices Board) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న పలు సెంటర్లలో.. ఒప్పంద ప్రాతిపదికన 20 ఎగ్జిక్యూటివ్, ట్రేడ్ అనలిస్ట్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిల్లో ఎగ్జిక్యూటివ్ (మార్కెటింగ్) పోస్టులు 8, ఎగ్జిక్యూటివ్(డెవలప్‌మెంట్) పోస్టులు 11, ట్రేడ్ అనలిస్ట్ పోస్టులు 1 ఖాళీగా ఉన్నాయి. పోస్టును బట్టి బీఎస్సీ (అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ), ఎంఎస్సీ (బోటనీ), ఎంఏ (ఎకనామిక్స్), ఎంబీఏ (మార్కెటింగ్)లో ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఇక దరఖౄస్తుదారుల వయసు తప్పనిసరిగా 40 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్/ఈమెయిల్ ద్వారా కింది అడ్రస్‌కు ఆగస్టు 26, 2022లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా పై పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.30,000 నుంచి రూ.40,000 వరకు జీతంతో ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది.
ఈమెయిల్ ఐడీ: hrdatp.sb-ker@gov.in
అడ్రస్:
The Secretary,
Spices Board,
Ministry of Commerce & Industry, Govt. of India, SugandhaBhavan,N.H.By Pass,
Palarivattom.P.O, Kochi – 682025,
Kerala, India. – Ph: 0484 2333610.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.