SBI SCO Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బిఐ) భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 18వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది. ఎస్‌బిఐ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో 606 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు డిగ్రీ పూర్తైన అభ్యర్థులు అర్హులుగా పేర్కొంది ఎస్‌బిఐ.
పోస్టుల వివరాలు..
రిలేషన్‌షిప్ మేనేజర్ – 334
కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ – 217
ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ – 12
సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (ప్రొడక్ట్ లీడ్, సపోర్ట్) – 4
ఎగ్జిక్యూటివ్ (డాక్యుమెంట్ ప్రిజర్వేషన్) – 1
మేనేజర్ (మార్కెటింగ్) – 12
డిప్యూటీ మేనేజర్ (మార్కెటింగ్) – 26
అర్హతలు..
పోస్టులను బట్టి అర్హతలను నిర్ణయించారు. అయితే కనీస గ్రాడ్యూయేషన్‌తో పాటు.. పీజీ, ఎంబీఏ, పీజీడీఎం తదితర కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు..
ఎస్‌బిఐ విడుదల చేసిన పోస్టులకు 20 నుంచి 40 ఏళ్ల లోపు వయసున్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ఎంపిక విధానం..
ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ, ఇంటరాక్షన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
పరీక్ష విధానం..
200 మార్కుల ప్రశ్నపత్రం ఉంటుంది. పూర్తిగా ఆబ్జెక్టివ్ టైప్‌లో జరుగుతుంది. రెండు గంటల వ్యవధి ఉంటుంది. ఇంగ్లిష్నాలెడ్జ్ డిస్క్రిప్టివ్ఎగ్జామ్ కూడా ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ..
దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అక్టోబర్ 18వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం ఎస్‌బిఐ అధికారిక వెబ్‌సైట్ www.sbi.co.in ని చూడొచ్చు.
Also read:
NRI News: విదేశాల నుంచి తిరిగొస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఏమాత్రం ఏమరపాటైనా మొత్తం కోల్పోతారు..!
Janasena Pawan Kalyan: బద్వేల్ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న జనసేన.. ఆ నిర్ణయానికి కారణమేంటంటే..