SBI Recruitment: ఎస్‌బీఐ స్పెషల్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టులకు అప్లై చేసుకున్నారా.? దరఖాస్తులకు నేడే చివరి తేదీ..

|

May 04, 2022 | 8:27 AM

SBI Recruitment: స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (SBI) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ విభాగం ఈ ఖాళీలను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్‌లో భాగంగా స్పెషల్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు నేటితో...

SBI Recruitment: ఎస్‌బీఐ స్పెషల్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టులకు అప్లై చేసుకున్నారా.? దరఖాస్తులకు నేడే చివరి తేదీ..
Follow us on

SBI Recruitment: స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (SBI) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ విభాగం ఈ ఖాళీలను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్‌లో భాగంగా స్పెషల్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు నేటితో (04-05-2022) గడువు ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 11 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ హెడ్‌ (01), సీనియర్‌ స్పెషల్‌ ఎగ్జిక్యూటివ్‌లు (10) ఖాళీలు ఉన్నాయి.

* వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ హెడ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఐటీ/కంప్యూటర్‌ సైన్స్‌లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్, మంచి కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు ఉండాలి. అభ్యర్థుల వయసు 50 ఏళ్లు మించకూడదు.

* సీనియర్‌ స్పెషల్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు గ్రాడ్యుయేషన్, ఐటీ/కంప్యూటర్‌ సైన్స్‌లో బీఈ/బీటెక్, పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి. వయసు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను తొలుత పని అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 04-05-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: Sunset: సూర్యుడు 24 గంటలూ ఉంటే ఎలా ఉంటది.. వామ్మో అనుకుంటున్నారా.. అక్కడ మాత్రం ఇది కామన్..

Strong Password: మీ అకౌంట్‌కు హ్యాకర్లు గుర్తుపట్టలేని పాస్‌వర్డ్‌లు ఉండాలంటే ఇవి వాడండి..!

Heat Stroke: వేసవిలో పిల్లలకు వడదెబ్బ తగలకుండా ఉండేందుకు ఈ ఆహారాలు తినిపించాలి.. అవెంటంటే..