SBI Admit Card 2026: మరో 4 రోజుల్లోనే ఎస్‌బీఐ బ్యాంకుల్లో ఉద్యోగాలకు రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్ లింక్‌ ఇదే

దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఎస్బీఐ బ్రాంచుల్లో సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి మరో 4 రోజుల్లో ఆన్‌లైన్ రాత పరీక్ష నిర్వహించనుంది. ఈ క్రమంలో ఈ పోస్టుల అడ్మిట్‌ కార్డులను విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌, క్యాప్చా నమోదు చేసి అడ్మిట్‌ కార్డులను..

SBI Admit Card 2026: మరో 4 రోజుల్లోనే ఎస్‌బీఐ బ్యాంకుల్లో ఉద్యోగాలకు రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్ లింక్‌ ఇదే
SBI CBO Exam admit cards

Updated on: Mar 10, 2026 | 9:48 AM

హైదరాబాద్, మార్చి 10: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఎస్బీఐ బ్రాంచుల్లో సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి మరో 4 రోజుల్లో ఆన్‌లైన్ రాత పరీక్ష నిర్వహించనుంది. ఈ క్రమంలో ఈ పోస్టుల అడ్మిట్‌ కార్డులను విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌, క్యాప్చా నమోదు చేసి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ రాత పరీక్ష మార్చి 14న పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది. ఈ నోటిఫికేషన్‌ కింద దేశ వ్యాప్తంగా మొత్తం 2,273 సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్స్‌ పోస్టులను భర్తీ చేయనుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్‌లో 80 పోస్టులు, అమరావతి సర్కిల్‌లో 98 వరకు ఖాళీలు ఉన్నాయి. ఆన్‌లైన్‌ రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి స్క్రీనింగ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

ఎస్‌బీఐ సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్స్‌ అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఎఫ్‌డీడీఐ 2026 ప్రవేశ పరీశక్ష తేదీ విడుదల.. ఎప్పుడంటే?

కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ఫుట్‌వేర్‌ డిజైన్ డెవలప్‌మేంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎఫ్‌డీడీఐ) 2026-27 విద్యా సంవత్సరానికి కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 12 క్యాంపస్‌లలో ప్రవేశాలకు మే 10న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ఇంటర్, పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సు లకు ఏదైనా డిగ్రీ చేసిన వారు ఎవరైనా ఈ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫుట్‌వేర్‌ డిజైన్, ప్రొడక్షన్, స్పోర్ట్స్ లైఫ్ స్టైల్ ఫుట్‌వేర్‌ డిజైన్, ఫ్యాషన్ ఫుట్‌వేర్‌ డిజైన్, లెదర్ లైఫ్ స్టైల్ ప్రొడక్ట్ డిజైన్, డిజిటల్ ప్రొడక్ట్ డిజైన్ కోర్సులతో పాటు ఈ ఏడాది నుంచి బీబీఏ, ఎంబిఏ, ప్యాషన్ కమ్యూనికేషన్, ప్యాషన్ డిజైన్, టెక్స్‌టైల్‌, అపెరల్ డిజైన్‌లలో కొత్తగా గ్రాడ్యుయేట్, పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సులు ప్రవేశపెట్టారు. ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు, ప్రవేశ పరీక్ష సిలబస్‌ వంటి ఇతర వివరాలకు ఎఫ్‌డీడీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఎఫ్‌డీడీఐ సూచించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.

Follow Us