RRB Exam Date 2025: మరో వారంలో ఆర్‌ఆర్‌బీ పరీక్షలు.. 4 రోజులు ముందు అడ్మిట్‌ కార్డులు విడుదల

రైల్వే శాఖలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) ద్వారా నిర్వహించే పలు పరీక్షల తేదీలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో పారా-మెడికల్ పోస్టులతోపాటు జూనియర్ ఇంజినీర్, కెమికల్ సూపర్‌వైజర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్‌ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఈ పరీక్షలన్నీ ఈ నెలలోనే జరగనున్నాయి..

RRB Exam Date 2025: మరో వారంలో ఆర్‌ఆర్‌బీ పరీక్షలు.. 4 రోజులు ముందు అడ్మిట్‌ కార్డులు విడుదల
RRB Exam Date

Updated on: Apr 20, 2025 | 7:03 AM

హైదరాబాద్‌, ఏప్రిల్ 20: రైల్వే శాఖలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) ద్వారా నిర్వహించే పలు పరీక్షల తేదీలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో పారా-మెడికల్ పోస్టులకు నియామక రాత పరీక్ష (సీబీటీ) ఆన్‌లైన్ విధానంలో ఏప్రిల్‌ 28 నుంచి 30 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఈ పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్‌ వివరాలను ఆర్‌ఆర్‌బీ తాజాగా వెల్లడించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి.. ఏ సిటీలో పరీక్ష కేంద్రం కేటాయించారో వంటి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక పరీక్షకు నాలుగు రోజుల ముందు అడ్మిట్‌ కార్డులు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు దేశ వ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో పారా-మెడికల్ ఖాళీల భర్తీకి గత ఏడాది నోటిఫికేషన్‌ను జారీ చేసిన విషయం తెలిసింది. ఈ ప్రకటన ద్వారా కింద దేశంలోని వివిధ రైల్వే రీజియన్లలో 1376 పారా మెడికల్ ఉద్యోగాలు భర్తీ చేయనుంది.

అలాగే రైల్వే శాఖలో రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (RRB) ఇతర పరీక్షలు కూడా ఈ నెలలో జరగనున్నాయి. జూనియర్ ఇంజినీర్, కెమికల్ సూపర్‌వైజర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్‌ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి సీబీటీ 2 పరీక్షను ఏప్రిల్‌ 22వ తేదీన నిర్వహించనున్నట్టు ప్రకటించింది. పరీక్షకు 4 రోజుల ముందు అడ్మిట్‌ కార్డులు వెబ్‌సైట్‌లో విడుదల చేస్తారు. ఈ ప్రకటన ద్వారా మొత్తం 7,951 జూనియర్ ఇంజినీర్, కెమికల్ సూపర్‌వైజర్ తదితర ఖాళీలు భర్తీ చేయనున్నారు.

ఆర్‌ఆర్‌బీ పారామెడికల్‌ సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మే 5న పరీక్ష ఎస్‌బీఐ పీఓ మెయిన్స్‌ పరీక్ష.. వెబ్‌సైట్‌లో అడ్మిట్‌ కార్డులు విడుదల

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ప్రొబేషనరీ ఆఫీసర్‌ (పీవో) 2024 మెయిన్స్‌ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు తాజాగా విడుదలయ్యాయి. మే 5న ఈ పరీక్ష జరగనుంది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రిలిమినరీ పరీక్ష మార్చి 8, 16, 24 తేదీల్లో నిర్వహించగా ఏప్రిల్‌ 5న ఎస్‌బీఐ ఈ పరీక్ష ఫలితాలు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 600 ప్రొబేషనరీ ఆఫీసర్ల నియమకాలు చేపట్టనుంది. మెయిన్స్‌ అనంతరం ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

ఎస్‌బీఐ పీఓ మెయిన్స్‌ పరీక్ష అడ్మిట్‌ కార్డుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.