RRB Railway Jobs 2026: టెన్త్‌ పాసైన వారికి 22,195 రైల్వే ఉద్యోగాలు.. డైరెక్ట్ అప్లికేషన్‌ లింక్‌ ఇదే

టెన్త్, ఐటీఐ, అప్రెంటిస్‌ అర్హత కలిగిన అభ్యర్ధులు ఫిబ్రవరి 1 నుంచి ఆన్‌లైన్‌ విధానంలో RRB గ్రూప్ డీ రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 22,195 గ్రూప్‌ డి ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల్లో సికింద్రాబాద్‌ రీజియన్‌లో మొత్తం 1012 వరకు పోస్టులు ఉన్నాయి. ఇందులో పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్ తదితర..

RRB Railway Jobs 2026: టెన్త్‌ పాసైన వారికి 22,195 రైల్వే ఉద్యోగాలు.. డైరెక్ట్ అప్లికేషన్‌ లింక్‌ ఇదే
RRB Group D Recruitment

Updated on: Feb 01, 2026 | 2:52 PM

దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో గ్రూప్‌ 4 ఉద్యోగాలకు తాజాగా రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (RRB) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. టెన్త్, ఐటీఐ, అప్రెంటిస్‌ అర్హత కలిగిన అభ్యర్ధులు ఈ రోజు నుంచి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 22,195 గ్రూప్‌ డి ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల్లో సికింద్రాబాద్‌ రీజియన్‌లో మొత్తం 1012 వరకు పోస్టులు ఉన్నాయి. ఇందులో పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ తదితర ఖాళీలు ఉన్నాయి. ట్రాఫిక్, ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ తదితర విభాగాల్లో వీటిని భర్తీ చేస్తారు. ఆసక్తి కలిగిన వారు మార్చి 2, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐలో అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే జనవరి 1, 2026 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్సీ, ఓబీసీ, పీహెచ్‌ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.500 చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష రాసిన వారికి రూ.400 రీఫండ్‌ చేస్తారు. ఇక ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.250 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. వీరు కూడా ఆన్‌లైన్‌ రాత పరీక్షకు హాజరైతే పూర్తి ఫీజు రీఫండ్‌ చేస్తారు. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ఫిజికల్‌ టెస్టులు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైన అభ్యర్థులకు లెవెల్‌ 1 పోస్టులకు నెలకు రూ.18,000 జీతంతోపాటు నిబంధనల మేరకు డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులతో సుమారు రూ.35,000 వరకు మొదటి నెల నుంచే పొందవచ్చు.

రాత పరీక్ష విధానం ఎలా ఉంటుందంటే..

ఆన్‌లైన్‌ రాత పరీక్ష మొత్తం 100 ప్రశ్నలకు ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు ఉంటుంది. 90 నిమిషాల వ్యావధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. మొత్తం 4 విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. జనరల్‌ సైన్స్‌ విభాగం నుంచి 25 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్‌ విభాగం నుంచి 25 ప్రశ్నలు, జనరల్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ విభాగం నుంచి 30 ప్రశ్నలు, జనరల్‌ అవేర్‌నెస్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌ విభాగం నుంచి 20 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు అడుగుతారు. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కోత విధిస్తారు.

ఇవి కూడా చదవండి

ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us