Reliance scholarship: డిగ్రీ విద్యార్థులకు రియలన్స్‌ ఫౌండేషన్‌ స్కాలర్‌షిప్‌.. రూ. 2 లక్షలు పొందే అవకాశం.

|

Jan 06, 2023 | 8:36 PM

ప్రతిభావంతులై ఉన్నత విద్యకు ఆర్థిక పరిస్థితులు సహకరించని విద్యార్థుల కోసం రిలయన్స్‌ ఫౌండేషన్‌ సదవకాశాన్ని తీసుకొచ్చింది. డిగ్రీ చదువుతున్న విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్‌ అందిస్తోంది. ఈ స్కాలర్‌ షిప్‌లో భాగంగా సుమారు 5 వేల మంది విద్యార్థులకు..

Reliance scholarship: డిగ్రీ విద్యార్థులకు రియలన్స్‌ ఫౌండేషన్‌ స్కాలర్‌షిప్‌.. రూ. 2 లక్షలు పొందే అవకాశం.
Reliance Scholarship
Follow us on

ప్రతిభావంతులై .. ఉన్నత విద్యకు ఆర్థిక పరిస్థితులు సహకరించని విద్యార్థుల కోసం రిలయన్స్‌ ఫౌండేషన్‌ సదవకాశాన్ని తీసుకొచ్చింది. డిగ్రీ చదువుతున్న విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్‌ అందిస్తోంది. ఈ స్కాలర్‌ షిప్‌లో భాగంగా సుమారు 5 వేల మంది విద్యార్థులకు రూ. 2 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు. ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

రిలయన్స్‌ ఫౌండేషన్‌ అందిస్తోన్న ఈ స్కాలర్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు గుర్తింపు పొందిన సంస్థలో అండర్ గ్రాడ్యుయేషన్ మొదటి ఏడాది చదువుతూ ఉండాలి. ఇంటర్‌ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కుటుంబ వార్షిక ఆదాయం రూ. 15 లక్షలు మించకూడదు. అయితే రూ. 2.50 లక్షలలోపు ఆదాయం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు. భారతదేశానికి చెందిన విద్యార్థులు మాత్రమే ఈ స్కాలర్‌ షిప్ పొందడానికి అర్హులు. ఎంపికైన విద్యార్థులకు రూ. 2 లక్షల వరకు స్కాలర్‌షిప్‌ను అందిస్తారు.

ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, అడ్రస్ ప్రూఫ్‌, 10, 12 తరగతుల బోర్డు ఎగ్జామ్ మార్క్స్ షీట్‌తో పాటు ప్రస్తుత బోనఫైడ్‌ సర్టిఫికెట్ ఉండాలి. వీటితో పాటు ఇన్‌కమ్‌ ప్రూఫ్‌ తప్పనిసరిగా ఉండాలి. దరఖాస్తుల స్వీకరణకు 2013 ఫిబ్రవరి 14వ తేదీని చివరి తేదీతగా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..