Bank Jobs 2022: పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ అర్హతలున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు..

భారత ప్రభుత్వ రంగానికి చెందిన పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌.. 50 స్పెషలిస్ట్‌ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

Bank Jobs 2022: పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ అర్హతలున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు..
Punjab and Sind Bank Recruitment 2022

Updated on: Nov 04, 2022 | 6:40 PM

భారత ప్రభుత్వ రంగానికి చెందిన పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌.. 50 స్పెషలిస్ట్‌ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. టెక్నికల్‌ ఆఫీసర్‌, ఫైర్‌ సేఫ్టీ ఆఫీసర్‌, ఫారెక్స్‌ ఆఫీసర్‌, మార్కెటింగ్‌ ఆఫీసర్‌, ట్రెజరీ డీలర్‌ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ/బీఈ/ బీటెక్‌/ఎంబీఏ/పీజీడీబీఏ/పీజీడీబీఎం/సీఏ/సీఎంఏ (ఐసీడబ్ల్యూఏ)/ఎంటెక్‌/ఎంసీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం కూడా ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు వర్తిస్తుంది.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 20, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ నవంబర్‌ 5వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు సమయంలో జనరల్‌ అభ్యర్ధులు రూ.1003లు, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులు రూ.177లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ప్రాతిపదికన తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us