PGCIL Recruitment 2021: కేంద్ర విద్యుత్ శాఖకు చెందిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏకంగా 1,110 ఖాళీలను భర్తీ చేయనుండడం విశేషం. వీటిలో హైదరాబాద్ రీజియన్‌లో 76 ఖాళీలున్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ రేపటి నుంచి (జులై 21) ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
* మొత్తం 1110 ఖాళీలకు గాను.. సధర్న్ రీజియన్-1 హైదరాబాద్ 76, సౌథర్న్ రీజియన్-2 బెంగళూరు 114, కార్పొరేట్ సెంటర్ (గురుగ్రామ్) 44, నార్తర్న్ రీజియన్ 313, ఈస్టర్న్ రీజియన్ 156, నార్తీస్టర్న్ రీజియన్ 127, ఒడిశా ప్రాజెక్ట్ 53, వెస్టర్న్ రీజియన్ 227 చొప్పున భర్తీ చేయనున్నారు.
* ఐటీఐ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు సివిల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు బీఈ, బీటెడ్, బీఎస్సీ ఇంజినిరింగ్‌లలో ఏదో ఒక కోర్సు చేసి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 18 ఏళ్లు మించకూడదు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఈ పోస్టులను భర్తీ చేయడానికి ఎలాంటి రాత పరీక్ష ఉండదు. సంబంధిత కోర్సులో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 11,000 నుంచి రూ. 15,000 వరకు ఇస్తారు.
* పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..
Telangana: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో ఉద్యోగాలు