PJTSAU DAMUs Subject Matter Specialist Recruitment 2022: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU).. ఒప్పంద ప్రాతిపదికన సబ్జెక్ట్ మేటర్ స్పెషలిస్ట్(అగ్రోమెటియోరాలజీ) తదితర (Subject Matter Specialist Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 3
పోస్టుల వివరాలు: సబ్జెక్ట్ మేటర్ స్పెషలిస్ట్(అగ్రోమెటియోరాలజీ), అగ్రోమెట్ అబ్జర్వర్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.5,200ల నుంచి రూ.39,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో సైన్స్ స్ట్రీమ్‌లో ఇంటర్, అగ్రోమెటియోరాలజీ/ మెటియోరాలజీ/ అగ్రోనమీ/ అగ్రికల్చర్ ఫిజిక్స్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎంపికైన అభ్యర్ధులు పాలెం(నాగర్‌కర్నూల్ జిల్లా), రుద్రూర్(నిజామాబాద్ జిల్లా)లోని కృషి విజ్ఞాన కేంద్రాల్లో పని చేయవల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరవవచ్చు.
అడ్రస్: Office of the Director, Agro Climate Research Centre, Agricultural Research Institute, Rajendranagar,
Hyderabad – 500 030
ఇంటర్వ్యూ తేదీ: జూన్ 25, 2022 ఉదయం 10 గంటలకు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.