Oil India Limited Jobs 2023: రాత పరీక్షలేకుండా ఆయిల్‌ ఇండియాలో ఉద్యోగాలు.. ఇంటర్‌పాసైతే చాలు..

|

Feb 13, 2023 | 9:54 PM

ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌లో.. ఒప్పంద ప్రాతిపదికన ఫార్మసిస్ట్‌, టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌..

Oil India Limited Jobs 2023: రాత పరీక్షలేకుండా ఆయిల్‌ ఇండియాలో ఉద్యోగాలు.. ఇంటర్‌పాసైతే చాలు..
Oil India Limited
Follow us on

ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌లో.. ఒప్పంద ప్రాతిపదికన 10 ఫార్మసిస్ట్‌, టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల పాటు పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 22 నుంచి 43 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఈ అర్హతలున్నవారు కింది అడ్రస్లో ఫిబ్రవరి 15, 17 తేదీల్లో నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరు కావచ్చు. అర్హత సాధించిన వారికి రూ.16,640ల నుంచి రూ.19,500ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్..

OIL Hospital, Oil India Limited, Duliajan, Assam.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.