NCHM JEE 2026 Exam Date: హాస్పిటాలిటీ హోటల్ అడ్మినిస్ట్రేషన్‌లో ప్రవేశాలకు NCHM JEE 2026 నోటిఫికేషన్‌.. రాత పరీక్ష తేదీ ఇదే

వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ హోటల్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లలో 026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిచే నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ (NCHM JEE 2026) నోటిఫికేషన్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) విడుదల..

NCHM JEE 2026 Exam Date: హాస్పిటాలిటీ హోటల్ అడ్మినిస్ట్రేషన్‌లో ప్రవేశాలకు NCHM JEE 2026 నోటిఫికేషన్‌.. రాత పరీక్ష తేదీ ఇదే
NCHM JEE Registration

Updated on: Mar 27, 2026 | 10:37 AM

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ హోటల్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లలో 026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిచే నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ (NCHM JEE 2026) నోటిఫికేషన్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంక్ ఆధారంగా నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కేటరింగ్‌ టెక్నాలజీ (NCHM&CT) అనుబంధ ఇన్‌స్టిట్యూట్‌లలో బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ కోర్సుల్లో ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12 వేలకి పైగా సీట్లు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఏప్రిల్ 1, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

NCHM JEE 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

NCHM JEE 2026కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఇంగ్లిష్‌ సబ్జెక్టుగా ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఇంటర్ అర్హత కలిగిన వారు ఎవరైనా ఏప్రిల్ 1, 2026వ తేదీలోపు ఆన్‌లోన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్‌ అభ్యర్ధులు రూ.1000, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులు రూ.700, ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగ అభ్యర్ధులు, థర్డ్‌ జెండర్‌ అభ్యర్థులు రూ.450 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఇక రాత పరీక్ష ఏప్రిల్‌ 25, 2026న దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

NCHM JEE 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

రాత పరీక్ష విధానం

రాత పరీక్షలో మొత్తం 120 అబ్జెక్టివ్‌ టైప్‌ క్వశ్చన్‌లకు 480 మార్కులకు జరుగుతుంది. ప్రతి ప్రశ్నకు 4 మార్కుల చొప్పున కేటాయిస్తారు. నెగెటివ మార్కింగ్‌ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు చొప్పున కోత విధిస్తారు. పరీక్ష హిందీ, ఇంగ్లిష్‌ మాద్యమంలో నిర్వహిస్తారు. న్యూమరికల్‌ ఎబిలిటీ అండ్‌ అనలిటికల్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌ అండ్‌ లాజికల్‌ డిడక్షన్‌, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ ఎఫైర్స్‌లలో ఒక్కో విభాగం నుంచి 15 ప్రశ్నల చొప్పున 45 ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌లో 45 ప్రశ్నలు, ఆప్టిట్యూడ్‌ ఫర్‌ సర్వీస్‌ సెక్టార్‌లో 30 ప్రశ్నలు వస్తాయి.

NCHM JEE 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us