North Central Railway Sports Quota Recruitment 2022: భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన గోరఖ్‌పూర్ ప్రధాన కేంద్రంగా ఉన్న నార్త్ ఈస్టర్న్ రైల్వే (NCR).. స్పోర్ట్స్ కోటా ద్వారా గ్రూప్ సీ పోస్టుల (Group C posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 21
పోస్టుల వివరాలు: స్పోర్ట్స్ కోటా ద్వారా గ్రూప్ సీ పోస్టులు
క్రీడల లిస్టు: క్రికెట్, కబడ్డీ, బాస్కెట్ బాల్, హాకీ, వాలీవాల్, రెజ్లింగ్, అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్ తదితర క్రీడలు.
వయోపరిమితి: జులై 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఒలంపిక్ గేమ్స్, వరల్డ్ కప్, వరల్డ్ ఛాంపియన్‌షిప్, కామన్‌వెల్త్ గేమ్స్, ఛాంపియన్స్ ట్రోపీలో పాల్గొని ఉండాలి.
ఎంపిక విధానం: ఫీల్డ్ ట్రయల్స్, సాధించిన పతకాలు, విద్యార్హతల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము:
జనరల్ అభ్యర్ధులకు: రూ. 500
ఎస్సీ/ఎస్టీ/బీసీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు: రూ. 250
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 25, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: