TSPSC 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! ఇకపై టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 పోస్టులకు ఇంటర్వ్యూలు లేవోచ్‌..

|

Apr 13, 2022 | 3:21 PM

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌ 1, గ్రూప్ 2 సర్వీసులకు నిర్వహించే ఇంటర్య్వూలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం (ఏప్రిల్‌ 12) ఉత్తర్వులు (జీవో నెం.47) జారీ చేసింది..

TSPSC 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! ఇకపై టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 పోస్టులకు ఇంటర్వ్యూలు లేవోచ్‌..
Tspsc
Follow us on

Upper age limit increased 3 years for Telangana Police Department posts 2022: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌ 1, గ్రూప్ 2 సర్వీసులకు నిర్వహించే ఇంటర్య్వూలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం (ఏప్రిల్‌ 12) ఉత్తర్వులు (జీవో నెం.47) జారీ చేసింది. నియామకాల్లో పారదర్శకతతోపాటు నిరాటంకంగా ఈ ప్రక్రియ సాగేందుకు వీలుగా టీఎస్‌పీఎస్సీతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో కొత్తగా జరిగే అన్ని నియామక పరీక్షలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ఈ సందర్భంగా వెల్లడించింది.

కాగా తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలను చేపట్టనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. నియామకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టింది. వీటిల్లో భాగంగా భర్తీచేయనున్న గ్రూప్‌ 1,2 సర్వీసులకు ఇంటర్య్వూలను రద్దు చేస్తు తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్‌-1, గ్రూప్-2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు అవసరం లేదనే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. పోలీసు ఉద్యోగాల అభ్యర్థులకు కూడా రాష్ట్ర కేబినెట్‌ మరో శుభవార్త తెల్పింది. అదేంటంటే.. పోలీసు ఉద్యోగాలకు మూడేళ్ల వయోపరిమితి పెంపునకు మంత్రి వర్గం ఆమోదముద్ర వేసినట్లు తెలియజేసింది.

Also Read:

Covid 19: కరోనా కేసులు పెరగడంతో మూత పడుతున్న స్కూళ్లు.. ఇదే శాశ్వత పరిష్కారమా? నిపుణుల వాదన ఇదే..