Nlc India
NLC India Trade Apprentice Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన తమిళనాడులోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NLC India Limited Tamil Nadu).. 955 ట్రేడ్ అప్రెంటిస్, ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ పోస్టుల (Trade Apprentice & Non Engg Apprentice Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతితోపాటు ఐటీఐ/డిప్లొమా/సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ లేదా తత్సమాన అర్హత కలిగిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్ధుల వయసు ఏప్రిల్ 1, 2022 నాటికి ఖచ్చితంగా 14 యేళ్లు నిండి ఉండాలి. ఆసక్తి కలిగినవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం పూర్తి చేసిన దరఖాస్తులను పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు పంపించవల్సి ఉంటుంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు స్టైపెండ్ ఈ కింది విధంగా ఉంటుంది.
- ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ రూ.8,766ల నుంచి రూ.10,019 వరకు
- ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ రూ.15028
- నాన్-ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ రూ.12524
- ఎక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్ రూ.12524
ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్
- ఫిట్టర్: 60
- టర్నర్: 22
- వెల్డర్: 55
- మెకానిక్ (మోటార్): 60
- మెకానిక్ (ట్రాక్టర్): 5
- ఎలక్ట్రీషియన్: 62
- వైర్‌మాన్: 55
- ప్లంబర్: 5
- కార్పెంటర్: 5
- స్టెనోగ్రాఫర్: 10
- PASAA: 20
- మెకానిక్ (డీజిల్): 10
నాన్-ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్
- వాణిజ్యం (BCom): 25
- కంప్యూటర్ సైన్స్ (BSc., కంప్యూటర్ సైన్స్): 35
- కంప్యూటర్ అప్లికేషన్ (BCA): 20
- బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (BBA): 20
- జియాలజీ (Bsc., జియాలజీ): 5
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్
- మెకానికల్ ఇంజనీరింగ్: 50
- సివిల్ ఇంజనీరింగ్: 18
- ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్: 8
- కెమికల్ ఇంజనీరింగ్: 5
- మైనింగ్ ఇంజనీరింగ్: 25
- కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్: 30
- ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్: 8
- ఫార్మసిస్ట్: 7
- ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్: 50
నాన్-ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్
- వాణిజ్యం (BCom): 25
- కంప్యూటర్ సైన్స్ (BSc., కంప్యూటర్ సైన్స్): 35
- కంప్యూటర్ అప్లికేషన్ (BCA): 20
- బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (BBA): 20
- జియాలజీ (Bsc., జియాలజీ): 5
టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్
- మెకానికల్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్: 50
- ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్: 50
- సివిల్ ఇంజనీరింగ్: 25
- ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్: 05
- మైనింగ్ ఇంజనీరింగ్: 20
- కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్: 20
- ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్: 5
ముఖ్యమైన తేదీలు:
- ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: ఆగస్టు 10, 2022.
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 31, 2022.
- హార్డు కాపీలను పంపడానికి చివరి తేదీ: ఆగస్టు 31, 2022 (సాయంత్రం 5 గంటల లోపు).
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.