Neigrihms Recruitment 2021: నార్త్ ఈస్టర్న్ ఇందిరా గాంధీ రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్–మెడికల్ సైన్సెస్ (నైగ్రిమ్స్)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. షిల్లాంగ్‌లో ఉన్న ఈ క్యాంపస్‌లో సీనియర్ రెసిడెంట్ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. ఇందులో భాగంగా మొత్తం 39 పోస్టులను భర్తీ చేయనున్నారు.
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిషికేషన్లో భాగంగా అనెస్తీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, సీటీవీఎస్, డెర్మటాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, జనరల్ మెడిసిన్, న్యూరాలజీ పోస్టులను భర్తీ చేస్తారు.
* పైన తెలిపిన విభాగాల్లో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా ఇంటర్న్‌షిప్/హౌజ్మెన్షిప్ చేసి ఉండాలి.
* అభ్యర్థులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ అయి ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 45 ఏళ్లు మించకూడదు.
* అభ్యర్థులను ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులు పూర్తి వివరాలను neigrihms.recruitment@gmail.co మెయిల్‌కు పంపించాలి.
* దరఖాస్తులకు చివరి తేదీగా 01.06.2021 (మంగళవారం) నిర్ణయించారు.
* పూర్తి వివరాలకు www.neigrihms.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Also Read: Actress Pranitha: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్ ప్రణీత.. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఫోటోలు..
దర్యాప్తు మరింత ముమ్మరం…రెజ్లర్ సుశీల్ కుమార్ ను హరిద్వార్ తీసుకువెళ్లిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు