Jobs In Kia Motors: ఏపీలోని కియా మోటార్స్‌లో ఉద్యోగాలు.. పరీక్షకు ఇంకా ఒక్కరోజే గడువు.. పూర్తి వివరాలు..

|

Mar 28, 2021 | 2:31 PM

Jobs In Kia Motors: అనంతపురం జిల్లా పెనుకొండలో ఉన్న ప్రముఖ కార్ల కంపెనీ కియా మోటార్స్‌ ఉద్యోగాల భర్తీ చేపడుతోంది. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ (APSSDC) భాగస్వామ్యంతో ఈ నియామకాలను చేపడుతున్నారు...

Jobs In Kia Motors: ఏపీలోని కియా మోటార్స్‌లో ఉద్యోగాలు.. పరీక్షకు ఇంకా ఒక్కరోజే గడువు.. పూర్తి వివరాలు..
Kia Motors
Follow us on

Jobs In Kia Motors: అనంతపురం జిల్లా పెనుకొండలో ఉన్న ప్రముఖ కార్ల కంపెనీ కియా మోటార్స్‌ ఉద్యోగాల భర్తీ చేపడుతోంది. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ (APSSDC) భాగస్వామ్యంతో ఈ నియామకాలను చేపడుతున్నారు. ఫ్రెషర్స్‌తో పాటు అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు భర్తీ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. ఈ విషయమై APSSDC ట్వీట్‌ చేసింది.

ముఖ్యమైన విషయాలు..

* ఉత్తరాంధ్ర జిల్లాల్లో స్కిల్ కనెక్ట్‌ డ్రైవ్‌ ద్వారా నీమ్‌ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది.
* ఈ రిక్రూట్‌మెంట్‌ ద్వారా మొత్తం 200 స్థానాలను భర్తీ చేయనున్నారు.
* ఇందులో భాగంగా ఆన్‌లైన్‌ టెస్ట్‌ను మార్చి 30, 2021న నిర్వహించనున్నారు.
* ఆన్‌లైన్‌ టెస్టులో అర్హత సాధించిన వారిని ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
* ఈ పోస్టులకు ఏదైనా బ్రాంచ్‌లో డిప్లొమా పూర్తి చేసిన వారి అప్లై చేసుకోవచ్చు.
* 2016-2020 మధ్య ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
* అయితే ఈ ఉద్యోగాలు కేవలం పురుషులకు మాత్రమే.
* ఎంపికైన అభ్యర్థులకు రూ.14,000 నుంచి రూ.15000 వేతం అందిస్తారు.
* శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అభ్యర్థులు శ్రీకాకుళం జిల్లాలో జరిగే డ్రైవ్‌కు, తూర్పుగోదావరి జిల్లా, విశాఖపట్నం జిల్లాల అభ్యర్థులు విశాఖపట్నంలో జరిగే డ్రైవ్‌కు హాజరు కావాలి.
* పూర్తి వివరాలకు 1800 4252 422 నెంబర్‌కు ఫోన్‌ చేయమని సూచించారు.

APPSSDC చేసిన ట్వీట్..

Also Read: NBCC Recruitment 2021: NBCCలో ఉద్యోగాలు.. వేతనం రూ.40 వేల నుంచి రూ.1.40 వరకు.. ఎలా దరఖాస్తు చేయాలంటే..

KVS Admission 2021: కేంద్రీయ విద్యాలయ స్కూళ్లలో అడ్మిషన్లు.. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఎప్పటినుంచంటే..?

UPSC Recruitment 2021: యూపీఎస్సీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. గడువు ఎప్పటి వరకు అంటే..