NCDC Recruitment 2022: డిగ్రీ అర్హతతలో నెలకు రూ. లక్ష జీతంతో కేంద్ర కొలువులు! రాత పరీక్ష లేకుండా నేరుగా..

భారత ప్రభుత్వ కార్పొరేషన్‌ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్ కోఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌.. ఒప్పంద ప్రాతిపదికన 52 డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్, సీనియర్‌ కన్సల్టెంట్‌, కన్సల్టెంట్‌, యంగ్‌ప్రొఫెషనల్‌ తదితర పోస్టుల భర్తీకి..

NCDC Recruitment 2022: డిగ్రీ అర్హతతలో నెలకు రూ. లక్ష జీతంతో కేంద్ర కొలువులు! రాత పరీక్ష లేకుండా నేరుగా..
NCDC New Delhi

Updated on: Sep 30, 2022 | 10:25 AM

భారత ప్రభుత్వ కార్పొరేషన్‌ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్ కోఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌.. ఒప్పంద ప్రాతిపదికన 52 డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్, సీనియర్‌ కన్సల్టెంట్‌, కన్సల్టెంట్‌, యంగ్‌ప్రొఫెషనల్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫైనాన్స్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, ట్యాక్సేషన్‌, బ్యాంకింగ్‌ రెగ్యులేషన్స్‌, మార్కెటింగ్‌, మీడియా కమ్యునికేషన్, అగ్రి ఫైనాన్స్‌ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో సీఏ/ఐసీడబ్ల్యూఏ/మాస్టర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు పోస్టును బట్టి 32 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు అక్టోబర్‌ 31, 2022వ తేదీ సాయంత్రం 5 గంటల 30 నిముషాలలోపు ఈ మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, అనుభవం, షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.20,000ల నుంచి రూ.1,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఈమెయిల్ ఐడీ: careers@ncdc.in

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us