Mangalagiri AIIMS Recruitment: ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. భారత ప్రభుత్వ ఆరోగ్య కుంటుబ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థలో పలు విభాగాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
* మొత్తం 06 ఖాళీలకు గాను ప్రొఫెసర్ కమ్ ప్రిన్సిపల్(కాలేజ్ ఆఫ్ నర్సింగ్)–01, లెక్చరర్ ఇన్ నర్సింగ్(అసిస్టెంట్ ప్రొఫెసర్),కాలేజ్ ఆఫ్ నర్సింగ్–05.
* ప్రొఫెసర్ కమ్ ప్రిన్సిపల్(కాలేజ్ ఆఫ్ నర్సింగ్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నర్సింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు నర్స్ అండ్ మిడ్‌వైఫ్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. అభ్యర్థుల వయసు 55 ఏళ్లు మించకూడదు.
* ప్రొఫెసర్ కమ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కమ్ ప్రిన్సిపల్ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు నెలకు రూ.1,23,100 నుంచి 2,15,900 వరకూ చెల్లిస్తారు.
* లెక్చరర్ ఇన్ నర్సింగ్(అసిస్టెంట్ ప్రొఫసర్), కాలేజ్ ఆఫ్ నర్సింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు.. నర్సింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు నర్స్ అండ్ మిడ్‌వైఫ్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. అభ్యర్థుల వయసు 50 ఏళ్లు మించకూడదు.
* ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.67,700 నుంచి రూ. 2,08,700 జీతంగా చెల్లిస్తారు.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ముందుగా విద్యార్హతలు, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు 14-09-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Urvashi Rautela: ఊర్వశి రౌతేలా హ్యాండ్ బ్యాగ్ ధర ఎంతో తెలిస్తే అవాక్కావ్వాల్సిందే.. ఎంతో తెలుసా.?