MANAGE Hyderabad Jobs 2023: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌- మేనేజ్‌లో ఉద్యోగాలు.. నెలకు లక్షన్నర జీతం.. నో ఎగ్జాం..

|

Feb 16, 2023 | 9:55 PM

కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (మేనేజ్‌).. ఒప్పంద ప్రాతిపదికన..

MANAGE Hyderabad Jobs 2023: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌- మేనేజ్‌లో ఉద్యోగాలు.. నెలకు లక్షన్నర జీతం.. నో ఎగ్జాం..
MANAGE Hyderabad
Follow us on

కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (మేనేజ్‌).. ఒప్పంద ప్రాతిపదికన మేనేజర్-ఇన్నోవేషన్ మేనేజ్‌మెంట్, కంటెంట్ డెవలపర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తుచేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంటెక్‌, ఎంబీఏ, పీజీడీఎం, ఎంసీఏ, ఎంఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 50 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఈ అర్హతలున్నవారు మార్చి 4, 2023వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. విద్యార్‌హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.50,000ల నుంచి రూ.1,50,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.