TS Bharosa Centre Recruitment 2022: మహబూబాబాద్‌ భరోసా సెంటర్‌లో మహిళలకు ఉద్యోగాలు.. అర్హతలివే!

|

Apr 14, 2022 | 5:55 PM

తెలంగాణ పోలీస్‌ ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌కు (women safety wing) చెందిన భరోసా మహబూబాబాద్‌లోని వివిధ సెంటర్లలో.. ఒప్పంద ప్రాతిపదికన సెంటర్ కో ఆర్డనేటర్‌ కమ్‌ సైకాలజిస్ట్‌ (Centre coordinator cum psychologist Posts) పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్ధుల నుంచి..

TS Bharosa Centre Recruitment 2022: మహబూబాబాద్‌ భరోసా సెంటర్‌లో మహిళలకు ఉద్యోగాలు.. అర్హతలివే!
Ts Bharosa Centre
Follow us on

Mahabubabad Bharosa Centre Recruitment 2022: తెలంగాణ పోలీస్‌ ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌కు (women safety wing) చెందిన భరోసా మహబూబాబాద్‌లోని వివిధ సెంటర్లలో.. ఒప్పంద ప్రాతిపదికన సెంటర్ కో ఆర్డనేటర్‌ కమ్‌ సైకాలజిస్ట్‌ (Centre coordinator cum psychologist Posts) పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 6

పోస్టుల వివరాలు:

  • సెంటర్ కో ఆర్డనేటర్‌ కమ్‌ సైకాలజిస్ట్‌ పోస్టులు: 1
  • సపోర్ట్‌ పర్సన్‌ పోస్టులు: 1
  • లీగలఖ సపోర్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు: 1
  • మల్టీ పర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ ఏఎన్‌ఎం పోస్టులు: 1
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్‌ అకౌంటెంట్ పోస్టులు: 1
  • రిసెప్షనిస్ట్‌ పోస్టులు: 1

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.12,000ల నుంచి రూ.23,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి ఇంటర్‌, డిగ్రీ, బీఎస్సీ (నర్సింగ్‌), ఎల్ఎల్‌బీ/ఎల్ఎల్‌ఎం, ఎంఎస్‌/ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: ఎస్పీ కార్యాలయం, మహబూబాబాద్‌, తెలంగాణ.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 20, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

APVVP Kurnool Recruitment 2022: టెన్త్‌/ఇంటర్‌ అర్హతతో నెలకు రూ.52,000లు సంపాదించే అవకాశం.. కర్నూలు జిల్లాలో..