Kendriya Vidyalaya Jobs: తెలంగాణలోని కేంద్రీయ విద్యాలయ సీఆర్‌పీఎఫ్-బార్కస్, హైదరాబాద్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖకి చెందిన ఈ విద్యాలయంలో కాంట్రాక్ట్ విధానంలో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా పీజీటీ, టీజీటీ, ప్రైమరీ టీచర్స్, పీఆర్‌టీ, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్, క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ టీచర్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కోచ్, కౌన్సెలర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఇంగ్లిష్, హిందీ, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, సోషల్ స్టడీస్, సంస్కృతం, మ్యూజిక్ వంటి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు. పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్/ గ్రాడ్యుయేషన్, డిప్లొమా/ డిగ్రీ, బీఏ/బీఎస్సీ/ ఎమ్మెస్సీ, ఇంటెగ్రేటెడ్ ఎమ్మెస్సీ/ మాస్టర్స్ డిగ్రీ, ఇంటెగ్రేటెడ్ డిగ్రీ/ బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/ బీటెక్, బీఈడీ ఉత్తీర్ణత పొంది ఉండాలి.
* వీటితో పాటు కంప్యూటర్ నైపుణ్యాలు, సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు సంబంధిత అకడమిక్ సర్టిఫికేట్లతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.
* ఇంటర్వ్యూలను హైదరాబాద్ బార్కస్‌లోని కేంద్రీయ విద్యాలయంలో నిర్వహించనున్నారు.
* ఇంటర్వ్యూలను మార్చి 8, 9 తేదీల్లో నిర్వహించనున్నారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
https://hyderabadcrpf.kvs.ac.in/