
హైదరాబాద్, మార్చి 25: జేఈఈ మెయిన్ 2026 చివరి విడత (సెషన్ 2) పరీక్షలు మరో వారంలో మొదలుకానున్నాయి. ఈ క్రమంలో తాజాగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లను విడుదల చేసింది. అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి పరీక్ష జరిగే నగరం సమాచారానికి సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక మరో 4 రోజుల్లో అడ్మిట్ కార్డులు కూడా విడుదల కానున్నాయి. ఈ అడ్మిట్ కార్డులు విడుదలైన తర్వాత అభ్యర్ధుల పరీక్ష తేదీ, షిఫ్ట్, ఎగ్జాం సెంటర్ వివరాలు అభ్యర్ధులు తెలుసుకోవచ్చు. కాగా తాజా షెడ్యూల్ ప్రకారం జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి 8 వరకు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో రోజుకు రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నట్లు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) ప్రకటించింది.
జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 పరీక్షల సిటీ ఇంటిమేషన్ స్లిప్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ (JEE మెయిన్) 2026 సెషన్ 2కి సంబంధించిన పేపర్ 1 (BE/ BTech) పరీక్షలు ఏప్రిల్ 2, 4, 5, 6, 8 తేదీల్లో, పేపర్ 2A, 2B (BArch, BPlanning పేపర్లు) పరీక్షలను ఏప్రిల్ 7న జరగనున్నాయి. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 పరీక్షల సిటీ ఇంటిమేషన్ స్లిప్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.