JEE 2023 Result: నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు.. రిజల్ట్స్‌ ఇలా సింపుల్‌గా చెక్‌ చేసుకోండి.

|

Jun 18, 2023 | 7:28 AM

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది. ఈరోజు (ఆదివారం) ఫలితాలను విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇదిలాఉంటే ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలను...

JEE 2023 Result: నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు.. రిజల్ట్స్‌ ఇలా సింపుల్‌గా చెక్‌ చేసుకోండి.
Inter Results
Follow us on

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది. ఈరోజు (ఆదివారం) ఫలితాలను విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇదిలాఉంటే ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలను జూన్‌ 4వ తేదీన నిర్వహించిన విషయం తెలిసిందే. ఉదయం పేపర్‌ 1, మధ్యాహ్నం పేపర్‌ 2 పరీక్షను నిర్వహించారు.

పరీక్ష నిర్వహణ అనంతరం జూన్‌ 9వ తేదీన రెస్పాన్స్‌ షీట్‌ను విద్యార్థుల కోసం ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక తర్వాత జూన్‌11న కీ పేపర్‌ను విడుదల చేశారు. తాజాగా ఫైనల్ రిజల్ట్స్‌ను విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది పరీక్షకు మొత్తం 95 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు మొత్తం 1,80,226 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 360 మార్కులకు పరీక్ష నిర్వహించారు.

రిజల్ట్స్‌ ఇలా చెక్‌ చేసుకోండి..

* ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

ఇవి కూడా చదవండి

* అనంతరం హోం పేజీలో కనిపించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2023 రిజల్ట్ లింక్‌ను క్లిక్‌ చేయాలి.

* ఆ తర్వాత మీ లాగిన్‌ వివరాలను అందించి ఎంటర్‌ నొక్కాలి.

* ఫలితాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. భవిష్యత్తు అవసరాల కోసం ఫలితాలను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..