ITBP Recruitment 2022: టెన్త్‌/ఇంటర్‌ అర్హతతో ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ కానిస్టేబుల్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌.. 186 గ్రూప్ సీ నాన్-గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) విభాగంలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

ITBP Recruitment 2022: టెన్త్‌/ఇంటర్‌ అర్హతతో ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ కానిస్టేబుల్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
ITBP Constable Recruitment 2022

Updated on: Oct 20, 2022 | 8:35 AM

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌.. 186 గ్రూప్ సీ నాన్-గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) విభాగంలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఇంటర్మీడియట్‌, మోటార్‌ మెకానిక్‌ సర్టిఫికెట్‌/డిప్లొమా (ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌) లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతితోపాటు ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు నవంబర్‌ 27, 2022వ తేదీ నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 27, 2022వ తేదీ రాత్రి 11 గంటల 59 నిముషాలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్‌ 29, 2022వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, రాత పరీక్ష, ప్రాక్టికల్ (స్కిల్) టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ప్రతిభ కనబరచిన వారికి నెలకు రూ.21,700ల నుంచి రూ.81,100ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫకేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • హెడ్ కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్) పోస్టులు: 58
  • కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్) పోస్టులు: 128

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us