
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో శ్రీహరి కోటలో ఉన్న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (ఇస్రో).. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్, సైంటిస్ట్, ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషణ్ కింద మొత్తం 141 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 16వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా (నర్సింగ్), డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ, ఎంఈ, ఎంటెక్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 2025 నవంబర్ 14వ తేదీ నాటికి తప్పనిసరిగా సైంటిస్ట్/ఇంజినీర్-ఎస్‌సీ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు, మిగతా పోస్టులకు 18 నుంచి 35 ఏళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు ఉన్నవారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 14, 2025వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద సంబంధిత పోస్టులకు రూ.500 నుంచి 750 వరకు జనరల్ అభ్యర్ధులు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి ఈ కింది విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు.
ఇతర వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.