IOCL Recruitment 2022: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 29 మార్చి 2022. దరఖాస్తు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ iocl.comని సందర్శించాలి. ఈ రిక్రూట్‌మెంట్ (IOCL Recruitment 2022) ప్రక్రియలో మొత్తం 4 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన విద్యార్హతలను కూడా ప్రకటించారు.
అర్హతలు..
అభ్యర్థులు కనీసం 50% మార్కులతో గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్/యూనివర్శిటీ నుండి కెమికల్/రిఫైనరీ, పెట్రోకెమికల్ ఇంజనీరింగ్‌లో 3 సంవత్సరాల డిప్లొమా లేదా B.Sc (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ) డిగ్రీని కలిగి ఉండాలి. పెట్రోలియం రిఫైనరీ / పెట్రోకెమికల్స్ / ఫెర్టిలైజర్ / హెవీ కెమికల్ / గ్యాస్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో పంప్ హౌస్, ఫైర్ హీటర్, కంప్రెసర్, డిస్టిలేషన్ కాలమ్, రియాక్టర్, హీట్ ఎక్స్ఛేంజర్ మొదలైన వాటి ఆపరేషన్ (రొటేటింగ్ షిఫ్ట్)లో కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.
ఎంపిక ప్రక్రియ..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను వ్రాత పరీక్ష, స్కిల్/ప్రొఫిషియన్సీ/ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయబడతారు. దరఖాస్తు సమయంలో రిజిస్టర్ చేసిన మొబైల్, ఇ-మెయిల్‌కు ఎంపిక పక్రియకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు పంపిస్తారు.
వయసు అర్హత..
వయోపరిమితం కనీస వయస్సు 18 సంవత్సరాలు కాగా, గరిష్ట వయో పరిమితి 26 సంవత్సరాలు గా పేర్కొన్నారు.
Also read:
Russia – Ukraine Crisis: పుతిన్ ప్లాన్ రివర్స్.. రష్యాకు చుక్కలు చూపిస్తున్న ఉక్రెయిన్ సైన్యం..!
Bank Holiday Alert: సమ్మె ఎఫెక్ట్.. ఆ రెండు రోజులు పలు బ్యాంకులు బంద్.. పూర్తి వివరాలు మీకోసం..!