Indian Post Staff Car Driver Posts: భారత పోస్టల్ విభాగంలో స్టాఫ్ కారు డ్రైవర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ముంబయిలోని సీనియర్ మేనేజర్ (జేఏజీ)లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషనలో భాగంగా మొత్తం 16 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి ఎలాంటి అర్హతలు ఉండాలి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి వివరాలు ఓసారి చూద్దాం.
* స్టాఫ్ కారు డ్రైవర్లు పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* అంతేకాకుండా లైట్ అండ్ హెవీ మోటర్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు మోటార్ మెకానిజం తెలిసి ఉండాలి.
* అభ్యర్థులకు కనీసం మూడేళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండాలి.
* పైన తెలిపిన పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులు తమ వివరాలను సీనియర్ మేనేజర్, మెయిల్ మోటార్ సర్వీస్, వర్లి, ముంబయి అడ్రస్‌కు పంపించాలి.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 19,990 జీతంగా అందిస్తారు.
* దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 09-08-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.