Indian Oil Jobs 2022: టెన్త్‌/డిప్లొమా అర్హతతో నెలకు రూ.లక్షకు పైగా సంపాదించే అవకాశం.. పూర్తి వివరాలు తెలుసుకోండి..

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో.. 35 గ్రేడ్‌-III, గ్రేడ్-VII పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు..

Indian Oil Jobs 2022: టెన్త్‌/డిప్లొమా అర్హతతో నెలకు రూ.లక్షకు పైగా సంపాదించే అవకాశం.. పూర్తి వివరాలు తెలుసుకోండి..
Indian Oil Corporation Limited

Updated on: Dec 04, 2022 | 7:03 PM

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో.. 35 గ్రేడ్‌-III, గ్రేడ్-VII పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదోతరగతితోపాటు, ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రికల్ వర్క్‌మ్యాన్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌, డ్రాఫ్ట్‌మెన్‌ సివిల్‌ ట్రేడ్, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌, సర్వేయర్, కెమికల్‌ ఇంజనీరింగ్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌ తదితర ట్రేడుల్లో డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే డిసెంబర్‌ 26, 2022వ తేదీ నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 26, 2022వ తేదీ రాత్రి 11 గంటల 59 నిముషాలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హత సాధించిన వారికి గ్రేడ్‌-7 పోస్టులకైతే నెలకు రూ.37,500ల నుంచి 1,45,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. గ్రేడ్‌-3 పోస్టులకు నెలకు రూ.26,000ల నుంచి రూ.90,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.