ICMR Recruitment 2021: భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఈ సంస్థలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
* నోటిఫికేషన్‌లో భాగంగా మెడికల్ విభాగంలో 15 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* నెఫ్రాలజీ, యూరాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ, గ్యాస్ట్రో సర్జరీ, రేడియాలజీ, పాథాలజీ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులను భర్తీ చేయనున్న అభ్యర్థులు ఎంబీబీఎస్‌తో పాటు సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్ పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణతతో సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
* దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 40 ఏళ్లు మించకూడదు.
* అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 30-07-2021గా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Telangana Schools: పాఠశాలల పునఃప్రారంభంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొద్ది రోజులపాటు..