Defence Jobs: పదో తరగతి అర్హతతో ఇండియన్‌ ఆర్మీలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

|

Feb 21, 2022 | 6:22 PM

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇంటిగ్రేటెడ్‌ హెచ్‌ క్యూ ఎంఓడీ సఫాయివాలా (Safaiwala Posts) (ఎంటీఎస్‌) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

Defence Jobs: పదో తరగతి అర్హతతో ఇండియన్‌ ఆర్మీలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Indian Army Jobs 2022
Follow us on

Integrated HQ of MOD Army Camp Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇంటిగ్రేటెడ్‌ హెచ్‌ క్యూ ఎంఓడీ సఫాయివాలా (Safaiwala Posts) (ఎంటీఎస్‌) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 7

పోస్టుల వివరాలు: సఫాయివాలా (ఎంటీఎస్‌) పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే జనవరి 1, 1997 నుంచి డిసెంబర్‌ 31, 2003 మధ్య జన్మించి ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.18,000ల వరకు (లెవల్‌ 1) జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి లేదా తత్సమాన అర్హత ఉండాలి. అలాగే ఏదైనా సివిల్‌ లేదా ప్రభుత్వ ఆఫీసులో కనీసం 6 నెలలపాటు హైస్‌ కీపింగ్‌ పనిలో అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, అనుభవం, రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: కమాండెంట్‌, ఇంటిగ్నేటెడ్‌ హెచ్‌ క్యూ ఆఫ్‌ ఎంఓడీ, న్యూఢిల్లీ- 110010.

దరఖాస్తులకు చివరి తేదీ: నోటిఫికేషన్‌ విడుదల చేసిన 21 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాలి. (మార్చి 10, 2022)

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

సోషల్ సర్వీస్ సెంటర్లుగా మసీదులు..పెళ్లిళ్లను మసీదులో జరిపించి వారి ఖర్చు తగ్గించాలి!