Indian Air Force Jobs: ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఇక తాజాగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (IAF)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 282 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో కుక్, మెస్ స్టాఫ్, లోయర్ డివిజన్ క్లర్క్ వంటి పోస్టులు ఉన్నాయి. అర్హత, ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 7 వరకు ఉంది. హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లలో కూడా ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు పూర్తి వివరాలను వెబ్సైట్లో ద్వారా తెలుసుకోవచ్చు.
మెయింటైనెన్స్ కమాండ్, హెడ్‌క్వార్టర్- 153, ఈస్టర్న్ ఎయిర్ కమాండ్, హెడ్‌క్వార్టర్- 32, సౌత్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్, హెడ్‌క్వార్టర్- 11, ఇండిపెండెంట్ యూనిట్స్- 1, కుక్ (ఆర్డినరీ గ్రేడ్)- 1, మెస్ స్టాఫ్- 9, మల్టీ టాస్కింగ్ స్టాఫ్- 18, హౌస్ కీపింగ్ స్టాఫ్- 15, హిందీ టైపిస్ట్ 3, లోయర్ డివిజన్ క్లర్క్ 10, స్టోర్ కీపర్ 3, కార్పెంటర్ 3, పెయింటర్ 1, సూపరింటెండెంట్ (స్టోర్)- 5, సివిలియన్ మెకానిక్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్- 3 చొప్పున ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు వివిధ రకాల అర్హతలున్నాయి. సూపరింటెండెంట్ పోస్టుకు డిగ్రీ, లోయర్ డివిజన్ క్లర్క్, హిందీ టైపిస్ట్, స్టోర్ కీపర్ పోస్టులకు ఇంటర్, కుక్ పోస్టుకు మెట్రిక్యులేషన్, డిప్లొమా ఇన్ కేటరింగ్, ఇతర పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణులు కావల్సి ఉంటుంది.
అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి. ఇక అభ్యర్థులను రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం.. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక వెబ్సైట్ నుంచి దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా నింపి, అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి సంబంధిత ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చేరేలా పోస్టులో పంపించాలి. దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 7, 2021.