GATE 2022 answer key released: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE) 2022 ఆన్సర్ కీ ఈరోజు (ఫిబ్రవరి 21) విడుదలైంది. ఈ మేరకు ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రకటన విడుదల చేసింది. కాగా గేట్ పరీక్ష ఈ ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 13 వరకు నిర్వహించబడ్డాయి. ఈ పరీక్షకు సంబంధించిన అఫీషియల్ ఆన్సర్ కీ నేడు విడుదలైంది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ gate.iitkgp.ac.in నుంచి ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీలో ఏవైనా అభ్యంతరాలుంటే ఫిబ్రవరి 22 నుంచి ఫిబ్రవరి 25లోపు సమాధానాతకు వ్యతిరేకంగా సవాళ్ల (Challenge)ను లేవనెత్తడానికి ఐఐటీ ఖరగ్‌పూర్ అవకాశం కల్పించింది. అభ్యర్థి లేవనెత్తే ప్రతి అభ్యంతరానికి రూ. 500 రుసుమును తప్పనిసరిగా చెల్లించవల్సి ఉంటుంది.
కాగా ఐఐటీ ఖరగ్‌పూర్ ఇప్పటికే (ఫిబ్రవరి 15న) గేట్ 2022 రెస్పాన్స్ షీట్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆన్సర్ కీ సహాయంతో రెస్పాన్స్ షీట్‌లో అభ్యర్ధులు ఎన్ని మార్కులు సాధించారు అనే విషయాన్ని సులువుగా అంచనా వేయవచ్చు. అంతేకాకుండా గేట్ 2022 ఆన్సర్ కీతోపాటు, క్వశ్చన్ పేపర్‌ను కూడా విద్యార్ధులు డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కల్పించింది. ఇక ఈ పరీక్షకు సంబంధించిన తుది ఫలితాలు మార్చి 17(గురువారం)న విడుదల కానున్నాయి. అభ్యర్థులు తమ స్కోర్‌కార్డులను మార్చి 21 (సోమవారం) నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గేట్ 2022 పరీక్షకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్‌ల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.gate.iitkgp.ac.inను సందర్శించాలని అభ్యర్ధులకు ఈ సందర్భంగా సూచించింది.
గేట్ 2022 ఆన్సర్ కీని ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే..
GATE అనేది నేషనల్ లెవల్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ పరీక్షను ప్రతి ఏడాది IIT, IIScలు రొటేషనల్ పద్ధతిలో నిర్వహిస్తాయి. పీజీ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో అడ్మిషన్ల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారు. అలాగే కొన్ని నిర్ధిష్ట పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు, పీఎస్‌యూ రిక్రూట్‌మెంట్లకు గేట్ స్కోర్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా గేట్ పరీక్షలో అత్యుత్తమ స్కోరు సాధించిన అభ్యర్ధులు కేంద్ర ప్రభుత్వానికి చెందిన గ్రూప్ ఏ స్థాయి పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా పొందుకోవడానికి అర్హత సాధిస్తారు. అంటే.. భారత ప్రభుత్వంలోని క్యాబినెట్ సెక్రటేరియట్‌లో సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్ (టెలి), సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ (క్రిప్టో), సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ (S&T) ఉద్యోగాలు గేట్ స్కోర్ ఆధారంగా పొందుకోవచ్చన్నమాట.
Also Read: