IIT Recruitment 2022: ఐఐటీ ధన్‌బాద్‌లో నాన్ టీచింగ్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు..పూర్తి వివరాలు తెలుసుకోండిలా..

|

Jun 13, 2022 | 8:40 AM

భారత ప్రభుత్వానికి చెందిన ధన్‌బాద్‌ (ఝార్ఖండ్‌)లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (IIT Dhanbad).. ఒప్పంద ప్రాతిపదికన నాన్ టీచింగ్‌ స్టాఫ్‌ పోస్టుల (Non Teaching Staff Posts) భర్తీకి అర్హులైన..

IIT Recruitment 2022: ఐఐటీ ధన్‌బాద్‌లో నాన్ టీచింగ్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు..పూర్తి వివరాలు తెలుసుకోండిలా..
Iit Dhanbad
Follow us on

IIT Dhanbad Junior Coaching Assistant Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన ధన్‌బాద్‌ (ఝార్ఖండ్‌)లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (IIT Dhanbad).. ఒప్పంద ప్రాతిపదికన నాన్ టీచింగ్‌ స్టాఫ్‌ పోస్టుల (Non Teaching Staff Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 7

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: జూనియర్ కోచింగ్‌ అసిస్టెంట్లు (కోచ్‌లు/ జిమ్‌ ఇన్‌స్ట్రక్టర్లు) పోస్టులు

పే స్కేల్‌: నెలకు రూ.31,000ల నుంచి రూ.75,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30కు మించరాదు.

అర్హతలు: ఏదైనా గ్రాడ్యుయేషన్‌తో పాటు డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత క్రీడల్లో రెండేళ్ల కోచింగ్‌ అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: రూ.500

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 24, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.