ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (Indira Gandhi National Open University -IGNOU) జనవరి 2021 సెషన్ ప్రవేశాల దరఖాస్తు తేదీని పొడగించింది. గతంలో 2021 ప్రవేశాలకు ఫిబ్రవరి 28 చివరితేదీ ఉండగా.. తాజాగా దానిని మార్చి 15 వరకు పొడగించింది.
తాజాగా విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు ఇగ్నో ఆన్ లైన్ అడ్మిషన్ పోర్టల్ https://ignouadmission.samarth.edu.in/లో అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు https://ignou.samarth.edu.in ద్వారా ఆన్‌లైన్‌లో తిరిగి నమోదు చేసుకోవచ్చు. అలాగే మరిన్ని వివరాలను ignouadmission.samarth.edu.inలో తెలుసుకోవచ్చు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు తాజాగా మళ్లీ అప్లై చేసుకోవచ్చు. అసైన్‌మెంట్‌లను సమర్పించారా లేదా మునుపటి సెమిస్టర్ యొక్క టర్మ్-ఎండ్ పరీక్షలో హాజరయ్యారా అనే దానితో సంబంధం లేకుండా మీ ప్రోగ్రామ్ పై కోర్సులకు అప్లై చేసుకోవచ్చని ఇగ్నో తెలిపింది.
➵ ఇప్పటికే ఈ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు తమ యూజర్ ఐడీ, పాస్ వర్డ్ తో లాగిన్ అవ్వాలి.
➵ పోర్టర్‍లో ఎంటర్ చేయడంలో ఏవైన ఇబ్బుందులు ఎదురయితే.. అభ్యర్థులు అకౌంట్ రీసెట్ చేయడానికి లేదా ఈమెయిల్ ఐడీ లేదా మొబైల్ నంబర్ మళ్లీ అప్ డేట్ చేసుకోవడానికి మీ సమీపంలోని ఇగ్నో ప్రాంతీయ కేంద్రాలకు వెళ్ళాలి.
➵ పేమెంట్ అప్ డేట్ కాకపోయినా, సెకండ్ టైం పేమెంట్ చేయకుండా కాసేపు ఆగడం ఉత్తమం. పేమెంట్ అప్ డేట్ కోసం కనీసం ఒకరోజు వేచి చూడండి. ఆ తర్వాత మళ్లీ ఒకసారి ట్రై చేసి.. పేమెంట్ చేయడం ఉత్తమం.
➵ ఒకే దరఖాస్తుకు రెండు పేమెంట్స్ చేస్తే అందులో ఒకటి తిరిగి మీ అకౌంట్లో చేరుతుంది.
1. ఇగ్నో అధికారిక వెబ్‌సైట్ ignou.ac.in పై క్లిక్ చేయండి
2. హోమ్‌పేజీలోని రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
3. సూచనలను చదివి “రీ-రిజిస్ట్రేషన్ కోసం కొనసాగండి” అనే లింక్‌పై క్లిక్ చేయండి.
4. మీరు మొదటిసారి నమోదు చేసుకుంటే, “క్రొత్త రిజిస్ట్రేషన్” లింక్‌పై క్లిక్ చేయండి.
5. నమోదు చేసి పూర్తి సమాచారాన్నిఫిల్ చేయాలి.
6. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజు పే చేయాలి.
కాంటాక్ట్ సెంటర్:
ఇగ్నో కాంటాక్ట్ ఇమెయిల్: ssc@ignou.ac.in
టెలిఫోన్ నం. – 011-29572513, 29572514
Also Read:
కేంద్రప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నవారికి యూపీఎస్సీ సూచనలు.. ఏ ఎగ్జామ్ ఎప్పుడో తెలుసా ?