IFFCO AGT Recruitment 2022: నిరుద్యోగులకు శుభవార్త! ఇండియన్‌ ఫార్మర్స్‌ ఫర్టిలైజర్‌ కో ఆపరేటివ్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

భారత ప్రభుత్వ రంగానికి చెందిన న్యూఢిల్లీలోని ఇండియన్‌ ఫార్మర్స్‌ ఫర్టిలైజర్‌ కో ఆపరేటివ్‌ లిమిటెడ్‌ (IFFCO).. అగ్రికల్చర్‌ గ్రాడ్యుయేట్‌ ట్రైనీ పోస్టుల (Agriculture Graduate Trainee posts) భర్తీకి..

IFFCO AGT Recruitment 2022: నిరుద్యోగులకు శుభవార్త! ఇండియన్‌ ఫార్మర్స్‌ ఫర్టిలైజర్‌ కో ఆపరేటివ్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
Iffco

Updated on: Mar 29, 2022 | 10:14 AM

IFFCO Agriculture Graduate Trainee Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన న్యూఢిల్లీలోని ఇండియన్‌ ఫార్మర్స్‌ ఫర్టిలైజర్‌ కో ఆపరేటివ్‌ లిమిటెడ్‌ (IFFCO).. అగ్రికల్చర్‌ గ్రాడ్యుయేట్‌ ట్రైనీ పోస్టుల (Agriculture Graduate Trainee posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

పోస్టుల వివరాలు: అగ్రికల్చర్‌ గ్రాడ్యుయేట్‌ ట్రైనీ పోస్టులు

ట్రైనింగ్‌ వ్యవధి: ఏడాది

వయోపరిమితి: ఫిబ్రవరి 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్: ట్రైనింగ్‌ కాలంలో నెలకు రూ.33,300 స్టైపెండ్‌ ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత నెలకు రూ.37,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: అగ్రకల్చర్‌ స్పెషలేజేషన్‌లో నాలుగేళ్ల బీఎస్సీ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మే 2022లో వెలువడే చివరి సెమిస్టర్‌ ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం: రాత పరీక్ష (ప్రిలిమినరీ, ఫైనల్‌ టెస్ట్), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 15, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

NCR Sports Quota Recruitment 2022: స్పోర్ట్స్‌ కోటాలో.. నార్త్‌ ఈస్టర్న్‌ రైల్వేలో గ్రూప్ సీ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి!