NIN Recruitment 2022: ఐసీఎంఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థ హైదరాబాద్‌లోని క్యాంపస్‌లో పోస్టులను భర్తీ చేయనుంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 04 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ప్రోజెక్ట్ సీనియర్ రిసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ జూనియర్ రిసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఖాళీల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో పదో తరగతి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటిత ఓపాటు సంబంధిత పనిలో అనుభవం, నెట్ అర్హత తప్పనిసరిగా ఉండాలి.
* అభ్యర్థుల వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.
* ఇంటర్వ్యూలను కాన్ఫరెన్స్ హాల్, ఐసీఎమ్‌ఆర్-ఎన్‌ఐఎన్, హైదరాబాద్‌లో నిర్వహిస్తారు.
* వాక్ ఇన్ ఇంటర్వ్యూను 22-04-2022న నిర్వహించనున్నారు. అభ్యర్థులు సంబంధిత సర్టిఫికేట్లతో నేరుగా హాజరుకావాల్సి ఉంటుంది.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 15,800 నుంచి రూ. 44,450 వరకు చెల్లిస్తారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Uttarakhand: పెద్ద సూట్‌కేసుతో హోటల్ నుంచి బయటకు.. అనుమానంతో చెక్ చేస్తే.. కళ్లుచెదిరే సీన్..
AP Crime News: పెళ్ళికి కట్నం అడిగిన ప్రేమించిన యువకుడు.. మనస్తాపంతో లా స్టూడెంట్ సూసైడ్..