ICMR – NARI Coupon Manager Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన పూణెలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన ఐసీఎంఆర్ – నేషనల్ ఎయిడ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ICMR – NARI).. ఒప్పంద ప్రాతిపదికన కూపన్ మేనేజర్, ప్రాజెక్ట్ టెక్నీషియన్, సైంటిస్ట్-బి, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల (Coupon Manager Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం.
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 4
పోస్టుల వివరాలు: కూపన్ మేనేజర్, ప్రాజెక్ట్ టెక్నీషియన్, సైంటిస్ట్-బి, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.16,000ల నుంచి రూ.68,875ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్, ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: మే 20, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.