ICHR Recruitment 2022: ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హిస్టారికల్‌ రిసెర్చ్‌ ఎగ్జామినేషన్‌ 2022 నోటిఫికేషన్‌ విడుదల..ఖాళీలెన్నంటే..

|

Apr 12, 2022 | 7:46 PM

2022-23 సంవత్సరానికి గాను భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హిస్టారికల్‌ రిసెర్చ్‌ (జేఆర్‌ఎఫ్‌) ఎగ్జామినేషన్‌ 2022 కు (ICHR JRF Exam 2022)అర్హులైన అభ్యర్ధుల..

ICHR Recruitment 2022: ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హిస్టారికల్‌ రిసెర్చ్‌ ఎగ్జామినేషన్‌ 2022 నోటిఫికేషన్‌ విడుదల..ఖాళీలెన్నంటే..
Ichr
Follow us on

ICHR JRF Examination 2022 Notification: 2022-23 సంవత్సరానికి గాను భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హిస్టారికల్‌ రిసెర్చ్‌ (జేఆర్‌ఎఫ్‌) ఎగ్జామినేషన్‌ 2022 కు (ICHR JRF Exam 2022)అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

పరీక్ష: జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్స్‌ (జేఆర్‌ఎఫ్‌) 2022

ఖాళీల సంఖ్య: 80

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 25 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

ఫెలోషిప్‌: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.17600 చెల్లిస్తారు. దీనితోపాటు కంటిన్‌జెన్సీ గ్రాంట్‌ కింద ఏడాదికి రూ.16500 అందజేస్తారు.

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీలో హిస్టారికల్‌ స్టడీస్‌ సబ్జెక్టులో పీహెచ్‌డీ ప్రోగ్రాం చదవడానికి రిజిస్టర్‌ చేసుకున్న అభ్యర్థులు ఈ ఫెలోషిప్‌ ప్రోగ్రాంకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఎంపిక విధానం: రెండు దశల్లో ఉంటుంది. మొదటి దశలో 100 మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. దీనిలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని రెండో దశకు ఎంపిక చేస్తారు. రెండో దశలో ప్రజంటేషన్‌, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌/ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్: మెంబర్‌ సెక్రటరీ, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హిస్టారికల్‌ రిసెర్చ్‌ (ఐసీహెచ్‌ఆర్‌), 35 ఫెరోజెషాన్‌ రోడ్‌, న్యూదిల్లీ-110001.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: మే 6, 2022.

దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: మే 17, 2022.

స్టేజ్‌ 1 ప్రవేశ పరీక్ష తేదీ: జూన్ 8, 2022.

స్టేజ్‌ 2 ప్రజంటేషన్‌, ఇంటర్వ్యూ తేదీ: జూన్‌ 27 నుంచి జులై 6 వరకు జరుగుతాయి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

AP POLYCET 2022: ఏపీ పాలీసెట్ 2022 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. పరీక్ష ఎప్పుడంటే..