ICAI CA May 2022: సీఏ మే 2022 సెషన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకునే అభ్యర్ధులకు ముఖ్య సూచనలు..

|

Feb 24, 2022 | 6:42 AM

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI).. CA మే 2022 సెషన్‌కు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభించింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌..

ICAI CA May 2022: సీఏ మే 2022 సెషన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకునే అభ్యర్ధులకు ముఖ్య సూచనలు..
Icai
Follow us on

ICAI CA May 2022 exam schedule: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI).. CA మే 2022 సెషన్‌కు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభించింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ icaiexam.icai.orgలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 13 వరకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొనసాగుతుంది. కాగా ఐసీఏఐ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. సీఏ ఫౌండేషన్ పరీక్ష (CA foundation exam dates)లు మే 23, 25, 27, 29 తేదీల్లో జగరనున్నాయి. గ్రూప్ I ఇంటర్మీడియట్ పరీక్షలు మే 15 నుంచి 22 వరకు జరుగుతాయి. ఇక గ్రూప్ II పరీక్షలు మే 24 నుంచి 30 వరకు నిర్వహించనున్నారు. ఇక సీఏ ఫైనల్ కోర్స్ గ్రూప్ 1 పరీక్షలు మే 14 నుంచి మే 21 వరకు జరుగుతాయి. గ్రూప్ II పరీక్షలు మే 23 నుంచి మే 29, 2022వరకు జరుగుతాయి. ఇంటర్నేషనల్‌ ట్యాక్సేషన్‌ అసెస్‌మెంట్‌ పరీక్ష మే 14 నుంచి మే 17 జరగనున్నట్లు ఐసీఏఐ తెల్పింది.

ICAI CA exam 2022కు రిజిస్ట్రేషన్లు ఎలా చేసుకోవాలంటే..

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్ www.icai.orgను ఓపెన్‌ చేయాలి.
  • హోమ్‌పేజీలో కనిపించే examination tab లింక్‌పై క్లిక్ చేయాలి.
  • అప్లికేషన్‌ ఓపెన్‌ అవుతుంది. అవసరమైన వివరాలు ఫిల్‌ చేసి, రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించి, సబ్‌మిట్‌ చేయాలి.
  • తర్వాత అప్లికేషన్‌ను సేవ్‌ చేసుకుని, హార్డ్ కాపీని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

Also Read:

Cancel Board exam 2022: సీబీఎస్సీ 10, 12 తరగతుల ఆఫ్‌లైన్‌ పరీక్షల పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు!